సంక్రాంతికి జనసేన-టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

సంక్రాంతికి జనసేన-టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల
X

AP: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. సీట్ల పంపకాలపై ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లే తెలుస్తోంది. జనసేన గెలిచే స్థానాలపై 3 నెలల పాటు సర్వే చేయించిన పవన్ కల్యాణ్, ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల ఎంపికకు సమీక్షలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా, సంక్రాంతికి టీడీపీ, జనసేన అభ్యర్ధుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పటికే వైసీపీ దాదాపు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీకి 38 నుంచి 50 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకారం తెలిపిందని తెలుస్తోంది. అయితే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి టికెట్ ఇవ్వాలి అనేదానిపై అటు చంద్రబాబు.. ఇటు పవన్ కల్యాణ్‌లు కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వస్తే విడతల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని తెలుస్తోంది.

Tags:
Next Story
Share it