Jogi Ramesh : టీడీపీ, జనసేనలను బంగాళాఖాతంలో కలిపేస్తాం!

మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలనే కసితో రాజకీయ పార్టీలు వ్యూహ రచన చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి.

Jogi Ramesh : టీడీపీ, జనసేనలను బంగాళాఖాతంలో కలిపేస్తాం!
X

న్యూస్ లైన్ డెస్క్ : మరికొద్ది రోజుల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలనే కసితో రాజకీయ పార్టీలు వ్యూహ రచన చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి. సీఎం జగన్ ని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసాయి . ఇలా ఒక్కడిని చూసి మూడు పార్టీలు కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చాలా అరుదుగా జరిగాయి. కానీ ఇలా మూడు పార్టీలు కలిసినప్పటికీ కూడా గెలుపు పై నూటికి నూరు శాతం ధీమా లేకపోవడం ని చూస్తుంటే సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఏ రేంజ్ లో జనాల్లోకి దూసుకెళ్లాయో అర్థం అవుతుంది.

ఇదంతా పక్కన పెడితే మంత్రి జోగి రమేష్ నేడు టీడీపీ, జనసేన, బీజేపీ కలయికపై మాట్లాడుతూ 'ఎన్నికల తర్వాత ఈ మూడు పార్టీలను జనాలు బంగాళాఖాతం లో కలిపేస్తారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని. తొలుత 60 సీట్లలో పోటీ చేస్తామని చెప్పాడు. ఆ తర్వాత అది 24 కి చేరింది, ఇప్పుడు మరో మూడు సీట్లు కుదించుకొని 21 సీట్లకే పరిమితం అయ్యాడు. కనీసం ఆ 21 స్థానాల్లో కూడా అభ్యర్థులు లేరు' అంటూ జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

Tags:
Next Story
Share it