బైక్‌ను ఢీకొట్టిన ఎమ్మెల్యే ఎస్కార్ట్‌ వాహనం

ఎమ్మెల్యే ఎస్కార్ట్‌ వాహనం ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

బైక్‌ను ఢీకొట్టిన ఎమ్మెల్యే ఎస్కార్ట్‌ వాహనం
X

AP: ఎమ్మెల్యే ఎస్కార్ట్‌ వాహనం ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముదిగుబ్బ మండలం మొలకవేమల క్రాస్ వద్ద ఓ బైక్ ని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వాహనం ఢీకొట్టింది. వెంటనే గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల వద్ద ఆరా తీసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులు నల్లమడ మండలం కొండ కింద తండాకు చెందిన నారాయణ నాయక్, పీకానాయక్ లుగా తెలిపారు. కదిరి నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్కార్ట్ వాహనం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Tags:
Next Story
Share it