Pithapuram : పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దారుణంగా ఓడిపోతాడు!

గత కొద్దిరోజుల నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని పిఠాపురం స్థానం గురించి రాజకీయ వర్గాలలో జరిగి చర్చలు సాగుతున్న సంగతి తెలిసిందే.

Pithapuram : పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దారుణంగా ఓడిపోతాడు!
X

న్యూస్ లైన్, పిఠాపురం: గత కొద్దిరోజుల నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని పిఠాపురం స్థానం గురించి రాజకీయ వర్గాలలో జరిగి చర్చలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ స్థానం నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యబోతున్నారు. గత ఎన్నికలలో గాజువాక, భీమవరం స్థానాల నుండి పోటీ చేసి ఓడిపోయిన ఆయన, ఈ ఏడాది భీమవరం నుండి పోటీ చేస్తారు, లేదా ఎంపీ గా పోటీ చేస్తారని టాక్ వినిపించింది కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం పిఠాపురం ఎమ్మల్యే స్థానాన్ని ఎంచుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి పోటీ గా వైసీపీ నుండి వంగా గీత పోటీ చేస్తుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం వైసీపీ లో చేరిన సంగతి అందరికీ తెలిసిందే . ఆయన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ 'ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా పార్టీ పెడితే నేను అతని దగ్గరికి వెళ్లాలా?.. చిరంజీవి ఓడిపోయాడు.. పవన్ రెండు చోట్ల ఓడిపోయాడు. కాపు ఉద్యమం వల్ల నేను ఎంతో నష్టపోయాను. నా శత్రువుతో పవన్ కళ్యాణ్ చేతులు కలిపాడు. ఆయన పిఠాపురం నుండి ఓడిపోతాడు, ఇది రాసిపెట్టుకోండి' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Tags:
Next Story
Share it