Ap: ‘ఈ సంతోషం అందరిది.. నిజం, ప్రజలు గెలిచారు’

నిజం గెలిచింది.. ప్రజలు గెలిచారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Bhuvaneswari) అన్నారు.

Ap: ‘ఈ సంతోషం అందరిది.. నిజం, ప్రజలు గెలిచారు’
X

న్యూస్‌లైన్, డెస్క్: నిజం గెలిచింది.. ప్రజలు గెలిచారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Bhuvaneswari) అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu naidu) హైకోర్టులో మధ్యంతర బెయిల్ లభించిన విషయం తెలిసిందే. రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఆయన తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు.

ఈ సంతోషం అందరిదని అన్నారు. బాబు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు నారా భువనేశ్వరీ చెప్పారు. అంతకు ముందు ఇవాళ విజయనగరం (Vizianagaram) ప్రభుత్వ ఆసుపత్రిలో నారా భువనేశ్వరి రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు. డాక్టర్లను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే రైలు దుర్ఘటన బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు.

Tags:
Next Story
Share it