Nimmala Kristappa: పుట్టపర్తి టీడీపీలో భగ్గుమన్న విబేధాలు

పుట్టపర్తి టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప (Nimmala Kristappa) అసంతృప్తి వ్యక్తం చేశారు.

Nimmala Kristappa: పుట్టపర్తి టీడీపీలో భగ్గుమన్న విబేధాలు
X

Nimmala Kristappa: పుట్టపర్తి టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప (Nimmala Kristappa) అసంతృప్తి వ్యక్తం చేశారు. పుట్టపర్తి టిక్కెట్ ఆశించి భంగపడ్డ నిమ్మల కిష్టప్ప...చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూరరెడ్డికి పుట్టపర్తి టిక్కెట్ ఖరారు చేశారు చంద్రబాబు.

అయితే...చంద్రబాబు చేనేతలకు అన్యాయం చేశారని మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్లలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన నిమ్మల కిష్టప్ప...ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చాలా మంది ఒత్తిడి తెస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుతో తాడోపేడో తేల్చుకుంటా అంటున్నారు నిమ్మల కిష్టప్ప. దీంతో పుట్టపర్తి టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి.

Tags:
Next Story
Share it