Yuvagalam: 'యువగళం' ముగింపు సభకు పవన్ కళ్యాణ్ దూరం..కారణం ఏంటంటే!

ఈరోజు 'యువగళం- నవశకం' సభలో పాల్గొననున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అయితే, నిన్న రాత్రి నుండి ఆయన జ్వరం కారణంగా స్వల్ప అస్వస్థతతో ఉండడంతో సభకు కొంచెం ఆలస్యంగా చేరుకునే అవకాశం ఉంది.

Yuvagalam:  యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ దూరం..కారణం ఏంటంటే!
X

Visakhapatnam , Andhra Pradesh : నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తలపెట్టిన 'యువగళం' పాదయాత్ర ఎట్టకేలకు ముగిసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ముగింపు సభని ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టించే రేంజ్ లో ప్లాన్ చేసింది తెలుగు దేశం పార్టీ అధిష్టానం. విశాఖపట్నం జిల్లాలోని భోగాపురం మండలం, పోలిపల్లి గ్రామం, భూమాత టౌన్ షిప్ లో ఈ భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసారు. ఈ సభకి మిత్రపక్షం లో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నాడు. ముందుగా ఈ సభకి దూరం గా ఉండాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానించడం తో ఆయన ఈ సభకి హాజరు అయ్యేందుకు ఒప్పుకున్నాడు. దీంతో భోగాపురం మండలం మొత్తం ఎటు చూసిన టీడీపీ, జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో నింపేశారు కార్యకర్తలు. రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభకి హాజరు కాబోతున్నాడు.

సుమారుగా ఆరు లక్షల మంది జనాలు ఈ సభకి తరలి వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే నిన్న రాత్రి నుండి పవన్ కళ్యాణ్ తీవ్రమైన జ్వరం కారణంగా అస్వస్థతతో బాధపడుతున్నది. కాబట్టి సభకు కొంచెం ఆలస్యంగా చేరుకునే అవకాశం ఉందని, ఒకవేళ సభకి రాలేకపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదని ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు కలిసి నిర్వహిస్తున్న మొట్టమొదటి ఉమ్మడి సభకు ఇలాంటి అంతరాయాలు రావడం టీడీపీ - జనసేన కార్యకర్తలను కాస్త నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ సభకి రాకపోతే వైసీపీ పార్టీ తన మీడియా తో ఇరు పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదని, అందుకే పవన్ కళ్యాణ్ ఎదో ఒక సాకు చెప్పి 'యువగళం' ముగింపు సభకి డుమ్మా కొట్టాడని, ఇలా రకరకాలుగా దుష్ప్రచారం చేసే అవకాశం ఉందని టీడీపీ జనసేన అభిమానులు భయపడుతున్నారు.

Tags:
Next Story
Share it