RRR: టీడీపీలోకి రఘురామకృష్ణంరాజు.. ఆ స్థానం నుండి పోటీ?

బీజేపీ ప్రకటించిన ఎంపీల జాబితా లో రఘురామ కృష్ణం రాజు కి టికెట్ లేకపోవడం కూటమి పై సొంత క్యాడర్ లోనే తీవ్రమైన నెగటివిటీ ని తెచ్చేలా చేసింది.

RRR: టీడీపీలోకి రఘురామకృష్ణంరాజు.. ఆ స్థానం నుండి పోటీ?
X

న్యూస్ లైన్ డెస్క్: బీజేపీ ప్రకటించిన ఎంపీల జాబితా లో రఘురామ కృష్ణం రాజు కి టికెట్ లేకపోవడం కూటమి పై సొంత క్యాడర్ లోనే తీవ్రమైన నెగటివిటీ ని తెచ్చేలా చేసింది. మొదటి నుండి చంద్రబాబు ని , బీజేపీ ని నమ్ముకొని, ఒక రేంజ్ లో వైసీపీ మీద రెచ్చిపోయి నోటికొచ్చినట్లు కామెంట్స్ చేసిన రఘురామకృష్ణంరాజు కి టికెట్ లేదంటే కూటమి పై తీవ్రంగా ప్రభావం ఉంటుందని క్యాడర్ చంద్రబాబు ని హెచ్చరించింది. రఘురామకృష్ణం రాజు కూడా ఎట్టిపరిస్థితిలో నాకు కూటమి సీట్ ఇప్పించాల్సిందే అంటూ మొండిపట్టు పట్టడం తో చంద్రబాబు మళ్ళీ బీజేపీ తో భేరాలు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొన్ని కండీషన్స్ తో బీజేపీ అధిష్టానం నర్సాపురం ఎంపీ సీట్ టీడీపీ కి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అదేమిటంటే నర్సాపురం ఎంపీ టికెట్ టీడీపీ కి ఇస్తే, కడప ఎంపీ స్థానం బీజేపీ కి ఇవ్వాలని, అలాగే ఉండి ఎమ్మెల్యే సీటు కూడా బీజేపీ కి ఇవ్వాలని అధిష్టానం ప్రతిపాదించింది అట.

అలాగే టీడీపీ నుండి కూడా కొన్ని కండీషన్స్ వెలువడ్డాయట. పొత్తులో భాగం గా గతం లో అనపర్తి సీటు ని బీజేపీ కి కేటాయించింది టీడీపీ. అయితే అది ఇప్పుడు తిరిగి టీడీపీ కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. అంతే కాకుండా జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానం కూడా తిరిగి టీడీపీ తీసుకోనుంది అట. ఒక్క ఆర్ఆర్ఆర్ సీట్ కోసం ఇన్ని కీలక మార్పులు వచ్చాయి. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కి నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వకపోతే, ఆ పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా రాజులు పూర్తిగా వ్యతిరేకించే అవకాశం ఉందని, దాని ప్రభావం వల్ల మూడు నుండి నాలుగు సీట్లు పోయే అవకాశం ఉందని సర్వేలు రావడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వచ్చే సోమవారం లోపు వీటి అన్నిటి మీద అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tags:
Next Story
Share it