Rajampeta: అన్నమయ్యా.. చూడవయ్యా!

అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను పరామర్శించడానికి వెళుతున్న రాజంపేట టీడీపీ నేత గంటా నరహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

Rajampeta: అన్నమయ్యా.. చూడవయ్యా!
X

టీడీపీ నేత గంటా నరహరి నిరసన కార్యక్రమం

అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు

న్యూస్ లైన్ డెస్క్: అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను పరామర్శించడానికి వెళుతున్న రాజంపేట టీడీపీ నేత గంటా నరహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసి, రాజంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ‘‘అన్నమయ్యా.. చూడవయ్యా’’ అంటూ వరద బాధితులను పరామర్శించడానికి ఆదివారం ఉదయం బయలుదేరారు. అయితే అంతకుముందే పోలీస్ బలగాలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాజంపేటలోని గంటా నరహరి నివాసం దగ్గరే ఆయన్ను నిలిపి వేశారు. ఈ నేపథ్యంలో ఆయనను, టీడీపీ నేతలను అరెస్టు చేసి రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

Tags:
Next Story
Share it