Pawan Kalyan :బీజేపీ-టీడీపీ ఆటలో అరటిపండులా పవన్ కల్యాణ్!

పవన్ కళ్యాణ్ ని తెలుగు దేశం పార్టీ, బీజేపీ పార్టీ ఆటలో అరటిపండులాగా వాడుకొని వదులుతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Pawan Kalyan :బీజేపీ-టీడీపీ ఆటలో అరటిపండులా పవన్ కల్యాణ్!
X

న్యూస్ లైన్ డెస్క్: పవన్ కళ్యాణ్ ని తెలుగు దేశం పార్టీ, బీజేపీ పార్టీ ఆటలో అరటిపండులాగా వాడుకొని వదులుతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తొలుత పొత్తులో భాగాంగా 70 స్థానాల్లో పోటీ చేస్తాము అంటూ ప్రగల్బాలు పలికిన పవన్ కళ్యాణ్, అంత కాకపోయినా కనీసం 40 స్థానాలు అయినా తీసుకుంటారని అభిమానులతో సహా, రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ కేవలం 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని చెప్పి జనసైనికుల ఆత్మగౌరవాన్ని మంటల్లో కలిపేశారు పవన్ కళ్యాణ్. పోనీ చెప్పిన ఆ 24 స్థానాల్లో అయినా పోటీ చేస్తున్నారా అంటే అది కూడా లేదు. బీజేపీ పార్టీ పొత్తులోకి రాగానే మరో మూడు ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపీ స్థానం ని బీజేపీ కి ఇచ్చేసారు పవన్ కళ్యాణ్. ఇదేమిటి అని అడిగితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇలా చెయ్యాల్సి వచ్చింది అంటూ తన క్యాడర్ కి సర్దిచెప్పే ప్రయత్నం చేసారు.

రాష్ట్ర ప్రయోజనాలు కేవలం జనసేన కి మాత్రమే అవసరమా?, 144 స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ కి అవసరం లేదా?, అసలు పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నారు అనేది అభిమానులకు అంతు చిక్కని ప్రశ్న లాగ మిగిలిపోయింది. ఇప్పుడు జనసేన పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, నామినేషన్స్ వేసే వరకు కూడా ఈ 21 స్థానాలకు గ్యారంటీ లేదట. బీజేపీ తరుపున తనకి నర్సాపురం ఎంపీ టికెట్ రానందుకు రఘు రామ కృష్ణం రాజు తనకి నర్సాపురం పార్లమెంట్ కానీ, ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎదో ఒక స్థానం లో కానీ సీటు ఇప్పించాల్సిందే అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని పట్టుబడుతున్నారట. దీంతో ఇప్పుడు జనసేన పోటీ చెయ్యబోయే నర్సాపురం ఎమ్మెల్యే స్థానం రఘురామకృష్ణంరాజు కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది పవన్ కళ్యాణ్ చేతకాని తనమో, లేదా అమాయకత్వమో అసలు అర్థం కావడం లేదని, అన్ని కేసులలో చిక్కుకున్న చంద్రబాబు ఎలాంటి త్యాగం చెయ్యడానికి సిద్ధం గా లేదు, అలాంటిది పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత దిగజారుతూ, తనని నమ్ముకున్న వాళ్ళని ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు అని అభిమానుల ఆవేదన వర్ణనాతీతం. ఇది ఇలా ఉండగా మరోపక్క నామినేషన్స్ వేసే లోపు ఇంకెన్ని సీట్స్ ఎగురుతాయా చూడండి అంటూ సోషల్ మీడియా లో బెట్టింగ్స్ వేస్తున్నారు నెటిజెన్లు.

Tags:
Next Story
Share it