Amaravati : గాజు గ్లాస్ గుర్తుపై టీడీపీ హైకోర్టులో పిటిషన్!

జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుని స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం పై జనసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవలే హైకోర్ట్‌లో పిటిషన్‌ని దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Amaravati : గాజు గ్లాస్ గుర్తుపై టీడీపీ హైకోర్టులో పిటిషన్!
X

న్యూస్ లైన్, అమరావతి: జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుని స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం పై జనసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవలే హై కోర్ట్ లో పిటీషన్ ని దాఖా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి స్పందించిన ఎన్నికల సంఘం, గాజు గ్లాస్ గుర్తు ని జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో మాత్రమే కాకుండా, పోటీ చేస్తున్న రెండు ఎంపీ స్థానాల్లో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా ఇవ్వబోమని ఈ చెప్పుకొచ్చారు. కానీ జనసేన పార్టీ తరుపున న్యాయవాది మిగిలిన స్థానాల్లో కూడా గాజు గ్లాస్ గుర్తు జనసేనకు మాత్రమే ఖరారు చెయ్యాలని, స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వరాదని కోరింది. దీనికి అంగీకరించని కోర్టు, మళ్ళీ కొత్తగా పిటీషన్ ని పెట్టమని ఆదేశించింది. దీంతో నేడు తెలుగు దేశం పార్టీ తరుపున న్యాయవాది పిటీషన్ ని దాఖా చేస్తూ గాజు గ్లాస్ గుర్తు ని జనసేన కి మాత్రమే ఇవ్వాలని, మరొకరికి ఇవ్వరాదని తమ వాదనని వినిపొంచింది. ఇదంతా విన్న జడ్జి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ఎన్నో దశలో ఉంది అని ఈసీ కి కోరి తదుపరి విచారణను సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది. మరి హై కోర్టు తీర్పు ఏమని వస్తుందో చూడాలి.

Tags:
Next Story
Share it