Sharmila : కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యరిగా వైఎస్ షర్మిల

ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల ఏ స్థానం నుండి పోటీ చేయబోతుంది అనే దానిపై అందరిలో ఉత్కంఠ ఉండేది.

Sharmila : కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యరిగా వైఎస్ షర్మిల
X

న్యూస్ లైన్, కడప: ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల ఏ స్థానం నుండి పోటీ చేయబోతుంది అనే దానిపై అందరిలో ఉత్కంఠ ఉండేది. అనేక మంది ఆమె కడప జిల్లాలో ఎదో ఒకస్థానం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేస్తుందని అనుకున్నారు. కానీ ఆమె ఎవ్వరూ ఊహించని విధంగా కడప ఎంపీ గా పోటీ చేయబోతున్నట్టు నేడు అధికారిక ప్రకటన చేసింది. మరోపక్క వైసీపీ పార్టీ నుండి వై ఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల పోటీ చెయ్యడం వల్ల అవినాష్ రెడ్డి ఓట్లు చీలి, అతని ఓటమి కి కారణం అవుతుందా అనే సందేహాలు వైసీపీ క్యాడర్ లో మొదలయ్యాయి. కానీ జగన్ సునామి ముందు షర్మిల కి డిపాజిట్స్ దొరకడం కూడా కష్టమేనని, ఈ ఎన్నికలతో ఆమె రాజకీయ సన్యాసం తీసుకుంటుందని వైసీపీ క్యాడర్ బలమైన నమ్మకం తో ఉంది. మరి ఏమి జరగబోతుందో చూడాలి. ఈ ప్రాంతం లో ఎన్నికలు మొత్తం వై ఎస్ వివేకానందరెడ్డి హత్య ప్రభావం మీదనే కేంద్రికృతం అయ్యింది. ఆ ప్రభావం ఎవరికీ ప్లస్ అవుతుందో, ఎవరికీ మైనస్ అవుతుందో చూడాలి.

Tags:
Next Story
Share it