CM JAGAN : ఇవాళ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

సీఎం జగన్ (CM JAGAN) నేడు శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ రైతు భరోసా (ysr raithu bharosa) - పిఎం కిసాన్ (pm kishan)

CM JAGAN : ఇవాళ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
X

CM JAGAN : సీఎం జగన్ (CM JAGAN) నేడు శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ రైతు భరోసా (ysr raithu bharosa) - పిఎం కిసాన్ (pm kishan) రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లోకి బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ (adhra pradesh) రాష్ట్రవ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి రూ. 4 వేలు చొప్పున జమ కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,204.77 కోట్ల నిధులను కేటాయించింది. ఇక మూడో విడత రూ. 2000ల సాయాన్ని జనవరి లేదా ఫిబ్రవరిలో చెల్లించే అవకాశం ఉంది.

ఈ మేరకు ఇవాళ ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో బయలుదేరి 10: 15 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్ (CM JAGAN). 10:40 గంటలకు వై జంక్షన్ లో ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌ (CM JAGAN)... మధ్యాహ్నం 12:15కి రైతులకు వైయస్సార్ భరోసా, పిఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.

Tags:
Next Story
Share it