బెంగుళూరు కేంద్రంగా పైలట్ ప్రాజెక్ట్ గా ఈ సేవలను ప్రారంభించనుంది. ఫ్లిప్ కార్ట్ 4 మినిట్స్ లాగే...ఇప్పుడు అమేజాన్ కూడా ఈ కామర్స్ పై కాన్సంట్రేట్ చేసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇప్పుడు తన సేవలను మరింత విస్తరించే పనిలో పడింది. ‘క్విక్ కామర్స్’లో ఉన్న స్పేస్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. మరో నెల రోజుల్లో బెంగుళూరు కేంద్రంగా పైలట్ ప్రాజెక్ట్ గా ఈ సేవలను ప్రారంభించనుంది. ఫ్లిప్ కార్ట్ 4 మినిట్స్ లాగే...ఇప్పుడు అమేజాన్ కూడా ఈ కామర్స్ పై కాన్సంట్రేట్ చేసింది.
బుక్ చేసుకున్న 15 నిమిషాలు, లేదంటే అంతకంటే ముందే వస్తువులను డెలివరీ చేయనున్నట్టు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి ఇతర నగరాలకు విస్తరిస్తామని చెప్పారు. సిటీ నుంచి ప్రతి పల్లెలకు ఈ ఫెసిలిటీని అందేలా చూస్తున్నారు.దేశంలోని క్విక్ కామర్స్ రంగంలో ఇప్పటికే జొమాటోకు చెందిన బ్లింకిట్, జెప్టో, స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆన్‌లైన్ ఆర్డర్ల కోసం రిటైల్ పంపిణీ కేంద్రమైన డార్క్ స్టోర్ల బలమైన నెట్‌వర్క్ చుట్టూ ఈ మోడల్ పనిచేస్తుంది.
‘అమెజాన్ ఫ్రెష్’ ద్వారా అమెజాన్ ఇప్పటికే పండ్లు, కూరగాయలు, డెయిరీ ఉత్పత్తులు, సరుకులను రెండు గంటల్లోనే అందిస్తోంది. అయితే, పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంతకుమించిన వివరాలను అమెజాన్ వెల్లడించలేదు. అయితే దీన్ని ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే అమలు చేస్తుంది. ముంబై లాంటి సిటీల్లో ఫ్లిప్ కార్ట్ జస్ట్ 4 నిమిషాల్లో మనం ఆర్డర్ చేసింది మనకు డెలివరీ చేస్తుంది.