Bicycle:రూ:18కే కొత్త సైకిల్..ఎప్పుడో తెలుసా..?

మానవుడి మొదటి బైక్ అంటే సైకిల్ అనే చెప్పవచ్చు. ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు వాడుతున్న తరుణంలో సైకిల్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్రిటిష్ కాలంలో చాలామంది

Bicycle:రూ:18కే కొత్త సైకిల్..ఎప్పుడో తెలుసా..?
X

న్యూస్ లైన్ డెస్క్: మానవుడి మొదటి బైక్ అంటే సైకిల్ అనే చెప్పవచ్చు. ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు వాడుతున్న తరుణంలో సైకిల్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్రిటిష్ కాలంలో చాలామంది సైనికులు ఈ సైకిల్ లనే వాహనాలుగా వాడేవారు. బ్రిటిష్ వారు నుంచి విముక్తి పొందిన తర్వాత ఊరిలో పెద్ద పెద్ద ధనికులకే సైకిళ్ళు ఉండేవి. కానీ మామూలు జనాలకు అస్సలు ఈ సైకిల్లు ఉండేవి కావు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఊరిలో సైకిల్స్ పంపిణీ చేశాడు. దీని ద్వారా మారుమూల గ్రామాలకు కూడా సైకిళ్లు వచ్చాయి.

అలాంటి సైకిల్ పై వెళ్లి ఎన్నో పనులు చేసుకునేవారు. ఈ సైకిల్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన పనులను కూడా చేసుకునేవారు. పూర్వకాలంలో పెళ్లి చేస్తే సైకిల్ కట్నం కింద ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ సైకిల్ మూలన పడింది. ప్రతి ఇంటికి బైక్ లేదంటే కారు అనే వాహనం వచ్చేసింది. ఈ సైకిల్ అనేది కేవలం పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి, ఎవరైనా ఓల్డ్ ఏజ్ వ్యక్తుల దగ్గర మాత్రమే కనిపిస్తోంది.

అలాంటి సైకిల్ ప్రస్తుత కాలంలో మినిమం రూ:7000 నుంచి మొదలవుతుంది. కానీ ఒకప్పుడు ఇదే సైకిల్ 18 రూపాయలకే అందించారు. ప్రస్తుతం ఈ పైసలతో పంచర్ కూడా వేయించలేం. 1934లో ఒక వ్యక్తి సైకిల్ కొని దాన్ని రేటు రాయించారు. ఆ టైంలో సైకిల్ ధర 18 రూపాయలు. కానీ ప్రస్తుత కాలంలో 18 వేల రూపాయల సైకిల్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ బిల్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Tags:
Next Story
Share it