Gold rate: బంగారం ధరలు ఢమాల్.. భారీగా తగ్గిన ధరలు

పసిడి ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం ఒక్కరోజే భారీగా ధర తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ.980 తగ్గింది.

Gold rate: బంగారం ధరలు ఢమాల్.. భారీగా తగ్గిన ధరలు
X

న్యూస్ లైన్, హైదరాబాద్: పసిడి ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం ఒక్కరోజే భారీగా ధర తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ.980 తగ్గింది. హైదరాబాద్, విజయవాడలో గురువారంతో పొలిస్తే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.900 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాములు రూ.66400గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.980 తగ్గి ప్రస్తుతం రూ.72,440కు చేరింది. కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.92వేలుగా ఉంది.

కొన్ని రోజులుగా బంగారం ధరలు పరుగులు పెట్టింది. అక్షయ్ తృతీయ ముందు నుంచి గోల్డ్ రేట్ భారీగా పెరుగుతూ వచ్చింది. ఓ దశల రూ.80వేల మార్క్ చేరుతుందనే సంకేతాలు సైతం అందాయి. అయితే ప్రస్తుతం సీజన్ కాకపోవడంతో కాస్త ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. మళ్లీ పెళ్లిళ్ల సీజన్ మొదలైతే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. వెండి సైతం అతి త్వరలో రూ.లక్షకు చేరిన ఆశ్చర్యం లేదంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Tags:
Next Story
Share it