Gold Rates: హమ్మయ్య.. తగ్గిన బంగారం ధరలు

బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. నిన్నటి వరకు విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.

Gold Rates: హమ్మయ్య.. తగ్గిన బంగారం ధరలు
X

Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. నిన్నటి వరకు విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం అంటే పెద్దగా ఏం తగ్గలేదు కానీ మోస్తారుగా తగ్గాయి బంగారం రేట్లు. అయినప్పటికీ 70 వేలకు చేరువలోనే బంగారం ధరలు ఉన్నాయి.

మనదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఏ వస్తువుకు లేదన్న సంగతి తెలిసిందే. ఎలాంటి చిన్న పండుగ జరిగిన కచ్చితంగా మనవాళ్లు బంగారం కొనుగోలు చేస్తారు. దీనికి తగ్గట్టుగానే బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఇక తగ్గిన బంగారం ధరల వివరాల ప్రకారం... హైదరాబాద్ మహానగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గి 69, 250 గా నమోదు అయింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు తగ్గి...63, 490 గా అయింది. అటు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కిలో వెండి ధర రూ. 100 పెరిగి...79, 100 రూపాయలుగా నమోదయింది.

Tags:
Next Story
Share it