Gold Rates: తులం బంగారం @ 70 వేలు..లబోదిబోమంటున్న మహిళలు !

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బంగారం ధరలు (Gold Rates) విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా బంగారం తులం ధర ఏకంగా 70000 దాటిపోయింది.

Gold Rates: తులం బంగారం @ 70 వేలు..లబోదిబోమంటున్న మహిళలు !
X

Gold Rates: దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బంగారం ధరలు (Gold Rates) విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా బంగారం తులం ధర ఏకంగా 70000 దాటిపోయింది. దీంతో మహిళలను లబోదిబో అంటున్నారు. 50వేల రూపాయలు ఉన్నప్పుడు కొనుగోలు చేసిన.. ఇప్పుడు ఎక్కువ ధర వచ్చేదని భావిస్తున్నారు జనాలు. దేశ బులియన్ మార్కెట్ లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో బంగారం ధరలు (Gold Rates) ఇలా పెరుగుతున్నాయట.

బుధవారం రోజున కాస్త చల్లబడ్డ బంగారం ధరలు (Gold Rates) ఇవాళ మళ్లీ ఎగిసిపడ్డాయి. దీంతో హైదరాబాద్ మహానగరంలో పెరిగిన బంగారం అలాగే వెండి ధరల ప్రకారం... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు పెరిగి 70,030 రూపాయలుగా బంగారం ధర (Gold Rates) నమోదు అయింది.

అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) ₹10 పెరిగి 64, 260 రూపాయలుగా నమోదు అయింది. అటు వెండి ధరలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. దీంతో పిలువ వెండి ధర ₹100 పెరిగి... 81, 100 రూపాయలుగా నమోదు అయింది. మరో ఏడాది సమయానికి బంగారం ధర (Gold Rates) 80000 కు చేరుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు.

Tags:
Next Story
Share it