Gold Rates : బంగారం కొనుగోలు చేసేవారికి అలర్ట్‌..తగ్గిన ధరలు

బంగారం కొనుగోలు చేసేవారికి అలర్ట్‌. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి బిగ్‌ రిలీఫ్‌ దక్కింది.

Gold Rates : బంగారం కొనుగోలు చేసేవారికి అలర్ట్‌..తగ్గిన ధరలు
X

Gold Rates : బంగారం కొనుగోలు చేసేవారికి అలర్ట్‌. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. నిన్న స్థిరంగా నమోదు అయిన బంగారం ధరలు.... ఇవాళ మాత్రం తగ్గాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. దీంతో బంగారం ధరలు ఎగిసిపడుతున్నాయి. మన ఇండియాలో ఎలాంటి చిన్న పండగ జరిగిన... బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు జనాలు.

అందుకే ఇండియాలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా.. హైదరాబాద్ మహానగరంలో తగ్గిన బంగారం ధరల వివరాల ప్రకారం... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు తగ్గి... 62, 940 గా నమోదు అయింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు తగ్గి...57, 690గా అయింది. అటు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కిలో వెండి ధర రూ. 100 తగ్గి..., 76, 400 రూపాయలుగా నమోదయింది.

Tags:
Next Story
Share it