Business:ఊర్లో ఉంటూనే లక్షాధికారి కావచ్చు..వ్యాపారం ఇదే.!

ప్రస్తుత కాలంలో చాలామంది ఊర్లో ఉండి ఎలాంటి బిజినెస్ చేయాలో అర్థం కాక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ తెలివి ఉంటే ఏదైనా చేయవచ్చు అని కొంతమంది నిరూపిస్తూ

Business:ఊర్లో ఉంటూనే లక్షాధికారి కావచ్చు..వ్యాపారం ఇదే.!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది ఊర్లో ఉండి ఎలాంటి బిజినెస్ చేయాలో అర్థం కాక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ తెలివి ఉంటే ఏదైనా చేయవచ్చు అని కొంతమంది నిరూపిస్తూ ఉంటారు. కొంత పెట్టుబడి ఉంటే, కష్టపడి తత్వం ఉంటే చాలు మీరు లక్షాధికారి కావచ్చు.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఏ చిన్న కిరాణా కొట్టులోకి వెళ్లిన చిరుతిళ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అలాంటి స్నాక్స్ తయారీ యూనిట్ ను ప్రారంభిస్తే మీరు లక్షల్లో సంపాదించవచ్చు.

కాదు మరో నలుగురికి మీరు ఉపాధి కూడా కల్పించవచ్చు. మరి దాని వివరాలు ఏంటో చూద్దాం. మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఒక పెద్ద గది కావాలి. అంతేకాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి లైసెన్స్ కూడా తీసుకోవాలి. దీనికోసం కొన్ని మిషన్స్ అవసరమవుతాయి. మనం ఏ విధమైన స్నాక్స్ తయారు చేయాలో దానికి సంబంధించిన మిషన్స్ మనం కొనుగోలు చేయాలి. అలాగే ప్యాకింగ్ కోసం మిషన్ అవసరం ఉంటుంది. అలా దానికి కావలసిన మిషన్లు అన్నిటికి కలిపి ఐదు లక్షల వరకు ఖర్చవుతుంది. ఏ విధమైన స్నాక్స్ తయారు చేయడానికి కావలసిన ప్రతి ముడిసరుకు ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతుంది.

దాని ద్వారా మనం ప్రోడక్ట్ తయారు చేసి, ప్యాక్ చేసి సేల్ చేసుకోవాలి. మనం చాలా కిరాణా కొట్టుల్లో పాపడాల ప్యాకెట్లు చూస్తూ ఉంటాం. సాధారణంగా ఒక ప్యాకెట్ తయారు కావడానికి మూడు రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దీన్ని మనం నాలుగు రూపాయలకు దుకాణదారునికి అమ్ముతాం. అంటే ప్రతి ప్యాకెట్ మీద మనకు ఒక రూపాయి లాభం ఉంటుందన్నమాట. అలా బల్కుగా ఒక ప్యాక్ లో 30 ప్యాకెట్ల వరకు ఉంటాయి. అంటే మనం రోజుకు అలాంటివి రోజుకి 100 ప్యాకెట్లు అమ్మితే మూడు వేల రూపాయల లాభం. 200 అమ్మితే ఆరువేల రూపాయల లాభం వస్తుంది. ఈ విధంగా మీ వ్యాపారాన్ని మీ టాలెంట్ ప్రకారం విస్తరించుకోవచ్చు.

Tags:
Next Story
Share it