Telangana:బీర్లు తాగుతున్నారా ఇక కష్టమే..!

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది జ్యూస్ కంటే ఎక్కువ బీర్లు తాగుతూ ఉంటారు. ఎండలో తిరిగి తిరిగి చల్లని బీరు తాగందే అసలు నిద్రపోరు. అలాంటి బీర్ ప్రియులకు ఇకనుంచి

Telangana:బీర్లు తాగుతున్నారా ఇక కష్టమే..!
X

న్యూస్ లైన్ డెస్క్: సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది జ్యూస్ కంటే ఎక్కువ బీర్లు తాగుతూ ఉంటారు. ఎండలో తిరిగి తిరిగి చల్లని బీరు తాగందే అసలు నిద్రపోరు. అలాంటి బీర్ ప్రియులకు ఇకనుంచి గడ్డు కాలమే రాబోతుందని తెలుస్తోంది. తెలంగాణలో ఈ కొరత వల్ల బీర్లపై ఎఫెక్ట్ పడుతుందట. మరి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఏం నడుస్తుంది అయ్యా అంటే నీటి కొరత నడుస్తుంది అని చెప్పకనే చెప్పవచ్చు. ఈ నీటి కొరత వల్ల ఇప్పటికే అన్ని పంటలు ఎండిపోయాయి.

ప్రస్తుతం ఈ కొరత బీర్ల కంపెనీపై పడింది. దీంతో డిమాండ్ కు తగ్గట్టుగా బీర్లను బృవరీలు సప్లై చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీర్ల తయారీ కంపెనీలపై ఈ నీటి కొరతా ఎఫెక్టు భారీగా పడిందట. సాధారణంగా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీర్ల తయారీ ఫ్యాక్టరీలకు రోజుకు 44 లక్షల లీటర్ల నీటిని ఉపయోగించుకుంటాయి. గత నెలలో 48 లక్షల కేసుల బీర్ల విక్రయాల వల్ల ఎక్సైజ్ శాఖకు దాదాపుగా పదిహేను వందల కోట్ల రాబడి వచ్చిందట.

కానీ ఈ నెల నుంచి ఎక్కువగా ఎండలు ముదిరిపోవడంతో నీరు అడుగంటి పోయింది. దీనివల్ల బీర్ల కంపెనీల పై ఎఫెక్ట్ పడిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితి 1999 తర్వాత మళ్లీ ఇప్పుడు వచ్చిందని అంటున్నారు. గత కొన్ని నెలల నుంచి తెలంగాణలో తక్కువ వర్షపాతం వల్ల విపరీతమైన నీటి కొరత ఏర్పడింది. ఇక రాబోవు రోజుల్లో ఈ సమస్య మరింత ఎక్కువ అయితే మాత్రం బీర్ల కంపెనీలు ఉన్న బీర్లపై రేట్లు పెంచే అవకాశం కనిపిస్తోంది.

Tags:
Next Story
Share it