Devara:దేవర చిక్కుముడులు.. పార్ట్ 2 లోనే విప్పుతారా..?

దేవర సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.  అలాంటి ఈ చిత్రం కేవలం మూడు రోజులనే 250 కోట్లకు పైగా గ్రాస్ సాధించి  దూసుకుపోతోంది. గత మూడు రోజుల నుంచి ఏ థియేటర్లో చూసిన


Published Sep 29, 2024 07:45:00 PM
postImages/2024-09-29/1727615676_ntr.jpg

న్యూస్ లైన్ డెస్క్: దేవర సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.  అలాంటి ఈ చిత్రం కేవలం మూడు రోజులనే 250 కోట్లకు పైగా గ్రాస్ సాధించి  దూసుకుపోతోంది. గత మూడు రోజుల నుంచి ఏ థియేటర్లో చూసిన హౌస్ ఫుల్ బోర్డ్ లే కనిపిస్తున్నాయి.  ఆ విధంగా ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయినటువంటి దేవర  సినిమాలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.  ఆ రహస్యాలకు  ఎన్నో చిక్కుముడులు వేశారు డైరెక్టర్ కొరటాల శివ.  ఈ రహస్యాలన్నీ మనకు పార్ట్ 2 లోనే  తెలియబోతున్నట్టు తెలుస్తోంది. దేవరలో ఉన్నటువంటి కొన్ని  రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేవర మూవీ స్టార్టింగ్ లో  దయా, యతి అనే ఇద్దరి గురించి అజయ్ పోలీస్ ఎంక్వయిరీ మొదలుపెడతాడు.  అంతేకాకుండా చిత్రకథ వినిపించిన ప్రకాష్ రాజు వాళ్ల గురించి తప్ప అన్ని విషయాలు చెబుతాడు. ఇక ఇవే కాకుండా సముద్రం అడుగుభాగాన అనేక అస్తిపంజరాలు ఉంటాయి అవి ఎవరివి అనేది కూడా ఇందులో రివిల్ చేయలేదు. ఇదే కాకుండా దేవర కొడుకు వరని  పిరికివాడిగా ఇందులో చూపించారు. మరి తండ్రి మరణం వెనుక కారణం ఏంటని తెలుసుకోవడానికి అతని ఏం చేశాడని క్లూ సైతం దర్శకుడు కొరటాల శివ ఇందులో చూపించలేదు. ఇవే కాకుండా శ్రీకాంత్ బ్యాగ్రౌండ్,  దేవర చెల్లెలు  ఇక అనేక కీలకమైన పాత్రలను టచ్ చేసి వదిలాడు తప్ప లోతుగా చూపించలేదు.

అయితే వీటన్నింటికీ  పూర్తి ప్రాధాన్యత దక్కాలి అంటే పార్ట్ 2 లోనే ఉంటుందని తెలుస్తోంది. హీరోయిన్ జాన్వి కపూర్ కథ ఎంతో ఉంటుందని అందరూ భావించారు. అంతేకాదు ఈమె రెండు పేజీల డైలాగ్ చెబుతుందని ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. కానీ జాన్వి కపూర్ పాత్రకు అంత స్కోప్ లేదు.  ఈమె అసలు పాత్ర పార్ట్ 2 లో మొదలవుతుందని కొరటాల శివ చెప్పకనే చెప్పేశాడు.. ఈ విధంగా ఎన్నో రహస్యాలకు చిక్కుముడులన్ని రెండో భాగంలో ఉంటాయని తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr devara johnvi-kapoor koratala-shiva saif-ali-khan

Related Articles