సూర్యకాంతం చూసి ఏంటి అమ్మాయ్ వెతుకుతున్నావ్ అని అడిగారట. హైదరాబాద్ లో ఒక ఏనుగు బొమ్మ కొన్నాను. అది కనిపించడం లేదు అని జమున తెలిపింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొన్ని సార్లు ఏదో మాట్లాడాలనుకొని ఏదో మాట్లాడేస్తూ ఉంటాం. మనం సరదాగా అంటాం కాని వాళ్లకి ఇంకేదో అర్ధమవుతుంది. పాపం బాధపడతారు కూడా. ఇలాంటి విషమయమే ఇండస్ట్రీలో మన జమున గారికి ..సూర్యాకాంతానికి మధ్య జరిగిందట. జమున సరదాగా అన్న మాటలు సూర్యకాంతానికి చాలా బాధగా అనిపించాయట,
ఒకసారి జమున, సూర్యకాంతం, కెవి చలం హైదరాబాద్ నుంచి చెన్నైకి ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నారట. జమున తన బ్యాగులో ఏదో వెతకండం మొదలుపెట్టారు. సూర్యకాంతం చూసి ఏంటి అమ్మాయ్ వెతుకుతున్నావ్ అని అడిగారట. హైదరాబాద్ లో ఒక ఏనుగు బొమ్మ కొన్నాను. అది కనిపించడం లేదు అని జమున తెలిపింది.
ఏనుగు అంటే గుర్తుకు వచ్చింది నేను ఒకసారి ఏనుగు ఎక్కాను సరదాగా అనిపించింది అంటూ సూర్యకాంతం తన అనుభవాన్ని చెప్పారట. జమున వెంటనే ఓ ఏనుగు మరో ఏనుగును ఎలా మోసిందో ..దానికి బరువుగా అనిపించలేదో ఏంటో అని వెటకారంగా అందట. వెంటనే పక్కనే ఉన్న కెవి చలం.. ఏనుగు సంగతి పక్కన పెట్టండి.. ఇప్పుడు ఈ విమానం సంగతి ఏంటో అంటూ సూర్యకాంతం బరువుపై ఆయన కూడా సెటైర్లు వేశారు.
జమున, చలం సరదాగానే ఏడిపించినా సూర్యకాంతం చాలా బాధపడ్డారట. కనీసం తన వయసుకి కూడా మర్యాద ఇవ్వలేదని ఫీల్ అయ్యారట. కానీ జమున, సూర్యకాంతం రిలేషన్ పాడలేదు. డబ్బు విషయంలో సూర్యాకాంతమే తనకు ఇన్ స్పిరేషన్ అని చాలా చోట్ల చెప్పారుజమున. అంతే ఒక్కో సారి అంతే..మనం సరదాగా అంటాం ..వాళ్లకి మాత్రం బాధేస్తుంది.