Sathya Raj: హీరోయిన్ కు ఏమాత్రం తీసుకొని అందంతో కట్టప్ప కూతురు.!

బాహుబలి ద్వారా ఎంతో మంది నటినటులు ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయారు. ప్రభాస్, రానా తర్వాత  అంతటి పేరు సంపాదించుకున్న నటుల్లో యాక్టర్ సత్యరాజ్ కూడా ఒకరు. సత్యరాజ్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకొచ్చేది క


Published Sep 29, 2024 05:30:00 PM
postImages/2024-09-29/1727608352_kattappadaughter.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాహుబలి ద్వారా ఎంతో మంది నటినటులు ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయారు. ప్రభాస్, రానా తర్వాత  అంతటి పేరు సంపాదించుకున్న నటుల్లో యాక్టర్ సత్యరాజ్ కూడా ఒకరు. సత్యరాజ్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకొచ్చేది కట్టప్ప పాత్ర. ఇక బాహుబలిలో ఈ పాత్రే చాలా హైలైట్ అయిందని చెప్పవచ్చు. కట్టప్ప పాత్ర ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి సత్యరాజ్  బాహుబలికి ముందు మిర్చి, శంఖం వంటి సినిమాల్లో తండ్రి, మామయ్య ఇతర పాత్రల్లో చేసుకుంటూ  వచ్చారు.

అలాంటి ఆయనకు రాజమౌళి బాహుబలిలో ఛాన్స్ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేశారు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. అలాంటి కట్టప్ప  గురించి అందరికీ తెలుసు కానీ తన కుటుంబం గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఆయన కూడా ఎక్కడా కుటుంబానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను కానీ ఇతర విషయాలను కానీ పంచుకోరు.  కానీ సత్య రాజుకు ఓ కొడుకు కూతురు కూడా ఉన్నారు.

ఇప్పటికే ఆయన తనయుడు సిబిరాజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మయోన్, డోరా వంటి చిత్రాల్లో చేశాడు. ఆయన కూతురు పేరు దివ్య సత్యరాజ్.  అయితే ఈమె ఇండస్ట్రీలోకి రాలేదు కానీ  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే సత్యరాజ్ కూతురు  ఒక స్టార్ హీరోయిన్ అందానికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంది.

ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో కాకుండా న్యూట్రిషన్ గా కెరియర్ కొనసాగిస్తుందట. ఎప్పుడు చలాకీగా ఉంటూ  లైఫ్ కు సంబంధించిన టిప్స్ ఇస్తూ సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవ్వడంతో ఈమె కట్టప్ప కూతురా, హీరోయిన్స్ అందానికి ఏమాత్రం తక్కువ లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.

newsline-whatsapp-channel
Tags : news-line sathya-raj bahubali-kattappa sathyaraj-daughter divya-sathya-raj

Related Articles