Janhvi: జాన్వీని మోసం చేసిన కొరటాల.. పాపం బాధపడుతుందిగా.? 

ఏంటి జాన్వీ కపూర్ ని కొరటాల శివ నమ్మించి మోసం చేశారా.. ఇంతకీ జాన్వి కపూర్ ని కొరటాల శివ ఎందుకు మోసం చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న లింక్ ఏంటి..కొరటాల శివ చేసిన పనికి జాన్వీ ఎందుకు బాధపడుతుంది అనే సంచలన


Published Sep 27, 2024 04:05:00 PM
postImages/2024-09-27/1727427591_janhvi.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఏంటి జాన్వీ కపూర్ ని కొరటాల శివ నమ్మించి మోసం చేశారా.. ఇంతకీ జాన్వి కపూర్ ని కొరటాల శివ ఎందుకు మోసం చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న లింక్ ఏంటి..కొరటాల శివ చేసిన పనికి జాన్వీ ఎందుకు బాధపడుతుంది అనే సంచలన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా విడుదలైన దేవర సినిమా మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాపై తాజాగా ఎన్టీఆర్ కూడా స్పందించి అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి ఎప్పటికీ రుణపడి ఉంటానని ట్వీట్ చేశారు.

. దేవర సినిమాలో యాక్షన్స్ సన్నివేషాలు, హీరో, విలన్ కి సంబంధించిన అన్ని సీన్స్ చాలా బాగున్నాయి.కానీ ఒక్క విషయంలో మాత్రం కొరటాల శివ తప్పు చేశారని పిస్తోంది. అయితే ఇది నేను అంటున్న మాట కాదు. జాన్వి అభిమానులు అంటున్న మాట.. అదేంటంటే ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీ అయినటువంటి దేవర సినిమాలో  ఎన్నో ఆశలు పెట్టుకొని టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి జాన్వీ కపూర్ కి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వడం..

జాన్వికపూర్ సినిమాలో ఎక్కువగా కనిపించలేదు. కేవలం నాలుగైదు సన్నివేశాలకే పరిమితం అవ్వవడంతో ఆమె అభిమానులు కొరటాలపై ఫైర్ అవుతున్నారు. జాన్వీ కపూర్ ని నమ్మించి గొంతు కోశాడు.. ఎన్నో ఆశలు పెట్టుకొని తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే ఆమెకు సినిమాలో ఇచ్చే స్పేస్ ఇంతేనా అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.

అంతే కాదు జాన్వి అభిమానులైతే చాలా బాధపడుతున్నారు. ఇక జాన్విని కూడా తిట్టిపోస్తున్నారు.ఈ మాత్రం దానికి నువ్వు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే దేవర పార్ట్ 2 లో జాన్వీ కపూర్ స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr tollywood devara janhvi-kapoor koratala-shiva

Related Articles