mallik tej: ఫోక్ సింగర్ మల్లిక్‌ తేజ్‌ పై అత్యాచార కేసు..!

రాజ్ తరుణ్ , జానీ మాస్టర్ , ఇప్పుడు ఆ లిస్ట్ లో ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్ , ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ అత్యాచారం కేసు నమోదయ్యింది.


Published Sep 29, 2024 04:18:00 PM
postImages/2024-09-29/1727606963_malliktej.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండస్ట్రీ లో ఛాన్స్ చాలా మంది కల . అది అదృష్టం కూడా. కొంతమందికి ఈ అదృష్టం దక్కుతుంది. మరికొందరికి అందీఅందనట్లు ఊరిస్తుంది. చావో బతుకో ఇండస్ట్రీలోనే అనుకునే వారికి కొంతమంది చేతిలో మోసపోతారు. ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలు సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి వారిపై లైంగిక దాడి చేసి కోరిక తీరిన తర్వాత ముఖం చాటేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు చాలా వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ , జానీ మాస్టర్ , ఇప్పుడు ఆ లిస్ట్ లో ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్ , ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ అత్యాచారం కేసు నమోదయ్యింది.


జగిత్యాల జిల్లాలో మల్లిక్ తేజ్ అనే ఫోక్ సింగర్ పై అత్యాచార కేసు నమోదయ్యింది. లేడీ సింగర్ ను  చాలా కాలంగా..బెదిరింపులు , లైంగికవేధింపులకు గురి చేస్తున్నట్లు పోలీసులకు పిర్యాధు చేసింది. తెలంగాణలో ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్ తేజ ఎన్నో హిట్ సాంగ్స్ ని రచించి మంచి పేరు తెచ్చుకున్నారు. తన రచనల ద్వారా లోకల్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ జిగిత్యాల లోని మామిడి మౌనిక అనే యువతికి సింగర్ గా అవకాశం ఇచ్చాడు. వీళ్లిద్దరి కాంభినేషన్ లో మంచి మంచి పాటలు వచ్చాడు. దుబాయ్ వంటి ఇతర దేశాల్లో ఎన్నో ఈవెంట్స్ నిర్వహించారు. 


అవకాశాల కోసం తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని మల్లిక్ తేజ్ పై సింగర్ మామిడి మౌనిక ఫిర్యాదు చేసింది. తన యూట్యూబ్ ఛానల్ ఇన్ స్టాగ్రామ్ ఐడీలు పాస్ వర్డ్స్ లు మార్చి తన పై బెదిరింపులకు పాల్పపడుతూ మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు జగిత్యాల పోలీస్ స్టేషన్ లో పిర్యాధు చేసింది. ఈ క్రమంలో మల్లిక్ తేజ్ పై కేసు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu rape-casr mallik-teja

Related Articles