ఈ 12 జ్యోతిర్లింగాలపై శివుని ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : శివరాత్రి సంధర్భంగా భక్తులు అధిక సంఖ్యలో శివుని పూజలు పాల్గొంటారు. ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంటుంది. కాని ఈ నెలలో వచ్చే మాస శివరాత్రి రోజు పార్వతి దేవి ..శివుడు ని కళ్యాణం చేసుకుందని ఓ నానుడి ఉంది. అయితే ఈ రోజు శివునికి ఓ ప్రత్యేక పూజలు చేస్తారు. శివరాత్రి రోజు ఉపవాసం , ధ్యానం , భజనలతో జాగారం చేస్తారు. అయితే ఈ రోజు భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైనది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ జ్యోతిర్లింగాలకు ప్రతి ఒక్కదానికి విశేషమైన ప్రత్యేకత ఉంది.జ్యోతిర్లింగాలు శివుని కాంతి రూపం అని చెబుతారు. ఈ 12 జ్యోతిర్లింగాలపై శివుని ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
* సోమనాథ జ్యోతిర్లింగం.. గుజరాత్ లోని సౌరాష్ట్రంలో సోమనాథ జ్యోతిర్లింగం మొదటి జ్యోతిర్లింగంగా గుర్తించబడింది. ఇది శివుని ప్రధాన పూజా స్థలాలలో ఒకటి. శివరాత్రి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
* మల్లికార్జున జ్యోతిర్లింగం.. శ్రీశైలం పర్వతంపై కృష్ణానది ఒడ్డున మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ శివరాత్రి సాక్షత్తు కైలాసమే దిగివచ్చినంత అధ్భుతంగా చేస్తారు.
* మహాకాలేశ్వర జ్యోతిర్లింగం.. ఉజ్జయినిలో ఉన్న మహాకాలేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి పొందింది. ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. ఇక్కడ భస్మహారతి చాలా ఫేమస్.
* ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నది ఒడ్డున ఇండోర్ సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉంది. శివరాత్రి పూజలు ప్రతి జ్యోతిర్లింగంలోను అధ్భుతంగా చేస్తారు. ప్రత్యేకపూజలు..భక్తులతో కోలాహలంగా ఉంటుంది.
* భీమాశంకర జ్యోతిర్లింగం.. మహారాష్ట్రలోని పూణే సమీపంలోని సహ్యాద్రి పర్వత శ్రేణులపై ఉన్న భీమాశంకర జ్యోతిర్లింగం కూడా ప్రధానంగా గుర్తించబడింది. 12 జ్యోతిర్లింగాలలో ఈ దేవాలయం కూడా చాలా ముఖ్యమైనది.
* కేదారనాథ జ్యోతిర్లింగం.. హిమాలయాల్లో కేదార్ పర్వతంపై ఉన్న కేదారనాథ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయ దర్శనం ..హిందువులకు అత్యంత ముఖ్యమైన యాత్రగా భావిస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని ఈ యాత్ర చేస్తుంటారు.
* కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం.. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం పవిత్ర కాశీలో ప్రసిద్ధి చెందినది. ఈ భూమ్మీద వెలసిన మొట్టమొదటి ఊరు కాశీ అంటారు.
* త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఎంతో విశిష్టమైనది. మహాశివరాత్రి రోజు ఇక్కడ చేసే భస్మహరతి చాలా ముఖ్యమైనదంటారు.
* వైద్యనాథ జ్యోతిర్లింగం.. జార్ఖండ్ లోని దేవఘర్లో ఉన్న వైద్యనాథ జ్యోతిర్లింగం మత విశ్వాసాల ప్రకారం చితాభూమి అని పిలువబడింది. ఇది ప్రధాన జ్యోతిర్లింగాలలో ఒకటి.
* నాగేశ్వర జ్యోతిర్లింగం.. గుజరాత్ లో ద్వారకాపురి సమీపంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం శివుని ఇష్ట ప్రకారం ప్రసిద్ధి చెందింది.
* రామేశ్వర జ్యోతిర్లింగం.. తమిళనాడులోని రామనాథంలో ఉన్న రామేశ్వర జ్యోతిర్లింగం 11వ జ్యోతిర్లింగంగా గౌరవించబడింది.