ఆ జాబితాలో ఉన్నవన్నీ జరగాలనీ కోరుకుంటున్నట్లు పేర్కొంది. అయితే ఈ విషయాన్ని సమంత తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొత్త ఏడాది సరికొత్తగా ఉండాలని , కోరికలు తీరాలని కోరుకోవడం సహజమే. జీవితం ఎక్కడా ఎవ్వరి కోసం ఆగదు. ఆగకూడదు. ప్రతి రోజు ఓ లైఫ్ మూమెంట్ ను నేర్చుకుంటూనే ఉంటాం. అయితే సమంత 2025 ఏడాదికి సంబంధించిన తన కోరికల జాబితాను వెల్లడించింది. తన రాశి వారికి 2025 ఎలా ఉండబోతుందనే వివరాలు ఉన్న ఓ సందేశాన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ జాబితాలో ఉన్నవన్నీ జరగాలనీ కోరుకుంటున్నట్లు పేర్కొంది. అయితే ఈ విషయాన్ని సమంత తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.
వృషభ, కన్య, మకర రాశి వారు కొత్త ఏడాది మొత్తం బిజీబిజీగా గడుపుతారని, వృత్తిలో మెరుగుపడి బాగా డబ్బు సంపాదిస్తారని ఆ జాబితాలో ఉంది. నమ్మకమైన, ప్రేమించే భాగస్వామి లభిస్తాడని, పిల్లలను పొందుతారని కూడా ఉంది. నెటిజన్లు ఈ పోస్టుకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఇది నీ కోరిక అయితే ..ఖచ్చితంగా నెరవేరాలని దేవున్ని ప్రార్ధిస్తున్నామంటు కామెంట్లు పెడుతున్నారు.