rerelease : 31 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కు రెడీ అవుతున్న రాముడు సినిమా !

ఈ యానిమేషన్‌ చిత్రాని తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 18న భారతీయ థియేటర్లలోకి రిలీజ్ అవుతుంది. 


Published Sep 29, 2024 03:27:00 PM
postImages/2024-09-29/1727603878_largeshriramanimeposterramayanathelegendofprinceramaoriginalimagrqu6p9ryyufy.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రామాయణం ఆధారంగా రూపొందించిన అధ్భుతమైన యానిమేషన్ మూవీ " ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్ "  మరోసారి తెరమీది కి వచ్చింది. 2024 అక్టోబర్ 18న తిరిగి విడుదల కానుంది. ఈ సినిమా 31 సంవత్సరాల క్రితం భారత్ థియేటర్లో రిలీజ్ అయిన యానిమేషన్ మూవీ.ఈ యానిమేషన్‌ చిత్రాని తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 18న భారతీయ థియేటర్లలోకి రిలీజ్ అవుతుంది. 


ఈ చిత్రాన్ని జపాన్ నిర్మాత యుగో సాకో, భారత్ నిర్మాత రామ్‌ మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని 1993లో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో పిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ యానిమేషన్ ను ఎంజాయ్ చేశారు. ఈ యానిమేషన్‌  చిత్రం మంచి విలువలను నేర్పుతుంది. అలాగే భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 


క్రాస్-కల్చరల్ సహకారం రామాయణాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. పిల్లలకు కూడా రాముడు హీరోని చేసిన సినిమా. అంతేకాకుండా భారతీయ సంస్కృతిని విదేశీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు. అయితే అప్పట్లో ఈ సినిమా పై పెద్ద దుమారం ఏర్పడింది. ఎందుకంటే అప్పట్లో రామాయణాన్ని వాళ్ల కు నచ్చినట్లు మార్చేశారని గొడవపడ్డారు. 


భారతీయ సంస్కృతిని వారు సరిగ్గా చూపించలేదని భావించారు కూడా. మళ్లీ ఈ సినిమా ఇప్పటికి రీరిలీజ్ అవుతుంది. బ్రయాన్ క్రాన్స్టన్ ,  జేమ్స్ ఎర్ల్ జోన్స్ లాంటి ప్రముఖ హాలీవుడ్ నటుల గాత్రదానం చిత్రానికి మరింత గ్లామర్‌ని చేర్చింది. వీరితో పాటు అరుణ్ గోవిల్,  అమ్రిష్ పూరి వంటి భారతీయ నటుల స్వరాలు హిందీ ప్రేక్షకులకు మరింత అనుబంధాన్ని కలిగించాయి. అందుకే ఈ చిత్రానికి ఎక్కువ డిమాండ్‌ ఉందని కాబట్టి దీని రీ-రిలీజ్ చేస్తున్నారు. 


 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movies movie-news rama re-release

Related Articles