CURRIES: ఏ గ్రేవీ కర్రీస్ టేస్టీ గా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా..!

వాటిలో ఒమేగా 3 ( OMEGA 3)ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

CURRIES: ఏ గ్రేవీ కర్రీస్ టేస్టీ గా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా..!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలు మనం ఫ్రైలు చేసుకుంటుంటాం కాని..గ్రేవీలే హెల్దీ. మరి అలా హెల్దీ గ్రేవీలు ఎలా చేసినా టేస్టీగా చెయ్యాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వాల్సిందే. ఖర్బుజా గింజల్లో( MUSK MELON SEEDS ) ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిలో ఒమేగా 3 ( OMEGA 3)ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ఇక.. ఏదైనా గ్రేవీ కర్రీ( CURRY GRAVY) కి మరింత రుచి పెంచడానికి కుడా ఈ గింజలను వాడొచ్చు. చాలా వరకు గ్రేవీ కర్రీలో రుచి పెంచడానికి జీడిపప్పు, గసగసాలు వాడతారు. కానీ వాటాికి బదులు... ఈ ఖర్బుజా గింజలను నీటిలో నానపెట్టి.. దానిని మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. దీనిని చికెన్, మటన్ లేదంటే పనీర్ , మఖానా కర్రీల్లోనూ వేసుకుంటే..టేస్ట్ అద్దిరిపోతుంది. వీటితో పాటు కాసింత కరివేపాకు కూడా వేసుకొండి. కూరలు రుచి రాక మానదు.

నాన్ వెజ్ కర్రీస్ ( NON VEG CURRIES) అయితే .. కాసింత అల్లం వెల్లుల్లి..చక్కగా ..మసాలాలు , జీడిపప్పు, కర్భూజా గింజలు, గసగసాలు నూరి గ్రేవీ చేస్తే నాన్ వెజ్ ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదే వెజ్ అయితే ముందుగా అనుకున్నట్లే కర్బూజా సీడ్స్ ను పేస్ట్ చేసి వేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఓ సారి ట్రై చేసి చూడండి.

Tags:
Next Story
Share it