Crime: సంగారెడ్డి జిల్లాలో మెడికో అనుమానస్పద మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ మెడికో అనుమానస్పద మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మంలోని మమత మెడికల్

Crime: సంగారెడ్డి జిల్లాలో మెడికో అనుమానస్పద మృతి
X

Crime: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ మెడికో అనుమానస్పద మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో రచనా రెడ్డి(25) అనే మెడికో PG చదువుతున్నారు. ప్రస్తుతం బాచుపల్లి మమత కాలేజీలో ఇంటర్న్ షిప్ చేస్తోంది రచనా. అయితే..సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారులో అపస్మారక స్థితిలో రచనా రెడ్డి(25) పడి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.

ఇక అనంతరం రచనా రెడ్డిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించారు వైద్యులు. మత్తు ఇంజెక్షన్ తో రచన అపస్మారక స్థితికి వెళ్లి చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. BHEL లోని HIGలో రచనా తల్లిదండ్రులు ఉంటున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అమీన్ పూర్ పోలీసులు.

గతేడాది నవంబర్ లో రచనా రెడ్డికి ఎంగేజ్ మెంట్ అయిందని.... వచ్చే నెల మార్చిలో ఆమె పెళ్లి కూడా ఉన్నట్లు సమాచారం.ఇక అటు రచన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాచూపల్లి మమత హాస్పిటల్ నుంచి పటాన్ చెరు ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it