Laxmi Devi:ఇలాంటి టైంలో స్త్రీలు తులసి పూజ చేస్తున్నారా.. అయితే పాపమే..!

భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి ఈ భారత్ లో చెట్టు, పుట్ట, రాయి,రప్ప ఇలా ఏదైనా దేవుడిగానే భావిస్తారు. అలాంటి మన భారతీయుల

Laxmi Devi:ఇలాంటి టైంలో స్త్రీలు తులసి పూజ చేస్తున్నారా.. అయితే పాపమే..!
X

న్యూస్ లైన్ డెస్క్: భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి ఈ భారత్ లో చెట్టు, పుట్ట, రాయి,రప్ప ఇలా ఏదైనా దేవుడిగానే భావిస్తారు. అలాంటి మన భారతీయుల సంప్రదాయం ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవిగా కొలుస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటే సంపదకు కొదువ ఉండదని భావిస్తారు. అలాంటి తులసి కోటను ఉదయం నిద్ర లేవగానే చూసినచో సమస్త ముల్లోకాల దేవతలను దర్శించిన ఫలితం కలుగుతుందని పురాణాలు కూడా చెబుతూ ఉంటాయి.

అలాంటి చెట్టును ఇంటి వద్ద మనం పెంచితే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని అంటుంటారు. ముఖ్యంగా తులసి కోటకు స్త్రీలు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఈ పూజలు చేసే సమయంలో స్త్రీలు ఇలాంటి మిస్టేక్స్ అసలు చేయకూడదట. అలా చేయడం మహా పాపమని లక్ష్మీదేవికి కోపం వస్తుందని శాస్త్రాలు చెబుతుంటాయి.

ముఖ్యంగా స్త్రీలు పొరపాటున కూడా ఉదయం స్నానం చేయకుండా తులసి కోటను ముట్టుకోరాదట. అంతేకాకుండా తులసి కోటకు ప్రతిరోజు పూజ చేసి ధూప, దీప, నైవేద్యాలు పెట్టాలట. అలాగే తులసి కోట ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోరాదట, అలాగే స్త్రీలు పీరియడ్స్ టైంలో తులసి కోటను అసలు తాకరాదని, దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆర్థికంగా నష్టపోతారని అంటున్నారు శాస్త్ర నిపుణులు.

Tags:
Next Story
Share it