Money Plant:ఇంట్లో మనీప్లాంట్ ఈ దిక్కున పెడితే ధన ప్రవాహమే.!

సాధారణంగా మన ఇండియన్స్ చెట్టు, పుట్ట, రాయి, రప్ప అన్నిటిని పూజిస్తారు. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో తులసి చెట్లను పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. తులసి చెట్టును

Money Plant:ఇంట్లో మనీప్లాంట్ ఈ దిక్కున పెడితే ధన ప్రవాహమే.!
X

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా మన ఇండియన్స్ చెట్టు, పుట్ట, రాయి, రప్ప అన్నిటిని పూజిస్తారు. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో తులసి చెట్లను పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి, మనకు ఆర్థిక సమస్యలు రాకుండా తొలగిస్తుందని అనుకుంటారు. అలా చాలామంది తులసి మొక్కనే కాకుండా ఇంట్లో మనీ ప్లాంట్ ను కూడా పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ పెంచుకోవడం వల్ల మనకు డబ్బులు వస్తాయని నమ్ముతారు. మరి అలాంటి మనీ ప్లాంట్ ఇంట్లో ఏ దిక్కున పెడితే మనకు ధనం అధికంగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మనీ ఎక్కువగా వస్తుందని భావిస్తారు. కానీ ఇది ఇంట్లో ఉండడం వల్ల దాని చుట్టుపక్కల వాతావరణం పాజిటివ్ గా ఉంటుందట. అలాంటి మనీ ప్లాంటును ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మనీ ప్లాంటును ఇంట్లో ఈశాన్య భాగంలో అసలు పెట్టకూడదట దీనివల్ల దరిద్రం వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ ప్లాంట్ ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలట. ఇది విగ్నేశ్వరుడికి ఇష్టమైన దిక్కు. కాబట్టి ఈశాన్య దిక్కులో ఈ ప్లాంట్ ఉంచితే మనకు బాగా కలిసి వచ్చి ఆరోగ్యం కూడా బాగుంటుందట. అంతేకాకుండా ఈ ప్లాంట్ ను ఆగ్నేయ దిశలో కూడా నాటవచ్చట.

అలాగే ఈ ప్లాంట్ నాటిన తర్వాత నీళ్లను తాకకుండా పైకి ఎదిగేటట్టు చూసుకోవాలట. వాస్తు ప్రకారం తీగలు ఎంత పెరిగితే అంత కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటారు. మనీ ప్లాంట్ లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అది నేలను తాకకుండా చూసుకోవాలని పండితులు అంటున్నారు. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఎండిపోతే మాత్రం మనకు ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం. అలా ఎండిపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా మనీ ప్లాంట్ కు రోజు నీరు పోసి ఆకులు ఎండి పోతే వాటిని తీసి వేస్తూ ఉండాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థికంగా ధనవంతులు అవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.

Tags:
Next Story
Share it