Rashi Phalalu: ఇవాళ్టి రాశి ఫలాలు..శుభకార్యాలు నిర్వహిస్తారు

మేషం ఆరోగ్యం పట్ల దృష్టి అవసరం. దూర ప్రయాణాలు చేస్తే మంచి జరుగుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం పట్ల కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

Rashi Phalalu: ఇవాళ్టి రాశి ఫలాలు..శుభకార్యాలు నిర్వహిస్తారు
X

horo

మేషం

ఆరోగ్యం పట్ల దృష్టి అవసరం. దూర ప్రయాణాలు చేస్తే మంచి జరుగుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం పట్ల కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం మంచివే.. కాని కాస్త జాగ్రత్త అవసరం.

వృషభం

సుదూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మెలుగుతారు. దూర కుటుంబ సభ్యులు ఇంటికి వస్తారు. వ్యాపారులకు మేలు జరుగుతుంది.

మిథునం

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కాబట్టి ఈ రాశి వారు కూడా ఆరోగ్యం పట్ల కాస్త దృష్టి పెట్టాలి. ఇవాల్టి రోజున మొత్తం ఆరోగ్యం పైన దృష్టి పెడితేనే మంచి జరుగుతుంది. కొంచెం కూడా అలసట లేదా... ఏదైనా వెలితిగా ఉంటే కచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలి.

కర్కాటకం

ఈ కర్కాటక రాశి వారికి ఇవాల్టి రోజున బాగాలేదు. కాస్త ఆరోగ్యం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించాలి. హనుమాన్ విగ్రహాన్ని పూజించాలి. ఈ రోజున మంచి జరుగుతుంది.

సింహం

సింహరాశి వారికి కూడా ఇవాళ మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కొన్నిచోట లాభాలు జరిగితే కొన్నిచోట్ల కాస్త నష్టాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఏది చేసినా ఆచితూచి పనిచేయాలి.

కన్య

చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లే వారికి మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి రోజంతా అద్భుతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

తుల

ఈ తుల రాశి వారికి ఈ రోజంతా తులాభారంగానే ఉంటుంది. కొన్ని మంచి జరుగుతాయి అలాగే కొన్ని చెడులు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లాభనష్టాలు ఇవాల్టి రోజున ఎదుర్కొంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

వృశ్చికం

ఈ రాశి వారు ఇవాళ దూర ప్రయాణాలు చేస్తే మంచి జరుగుతుంది. వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు కూడా మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ధనస్సు

ధనస్సు రాశి వారు ఇవాళ చాలా ఆనందంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటారు. కాబట్టి ఏ పని చేసినా కాస్త వెనుక ముందు ఆలోచించి చేయాలి. వ్యాపారస్తులకు మంచి లాభాలు జరుగుతాయి. సుదూర ప్రయాణాలు చేస్తే మంచి జరుగుతుంది.

మకరం

ఈ మకర రాశి వారికి ఇవాళ అద్భుతమైన జాతకం ఉంటుంది. ఏది చేసినా బంగారమే అవుతుంది. పటేందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మంచి జరుగుతుంది. అలాగే కారు బిజినెస్ చేసే వారికి.. ట్రావెలింగ్ రంగానికి చెందిన వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. అనుకున్న సమయానికి డబ్బులు పడతాయి.

కుంభం

ఈ రాశి వారు ఇవాళ అద్భుతమైన ఫలితాలు చవి చూస్తారు. దేవాలయాలకు వెళ్తారు. దర్శనాలు చేసుకుంటారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉంటారు. ఇంట్లో భార్యాభర్తలు చాలా ఆనందంగా గడుపుతారు ఇవాల్టి రోజున.

మీనం

ఈ మీన రాశి వారు కాస్త ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏది పడితే అది చేయకూడదు. ఆచితూచి అడుగులు వేయాలి. లేకపోతే అనేక ఇబ్బందులు పడతారు. రోజంతా జాలిగా గడపాలి.

Tags:
Next Story
Share it