Rashi Phalalu : ఇవాళ్టి రాశి ఫలాలు...కుటుంబ పరిస్థితులు బాగుంటాయి

# మేషం స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు

Rashi Phalalu : ఇవాళ్టి రాశి ఫలాలు...కుటుంబ పరిస్థితులు బాగుంటాయి
X

# మేషం

స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు.

# వృషభం

ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. స్థానచలణ సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. అనారోగ్య బాధలు ఉంటాయి.

# మిధునం

అనారోగ్య బాధలు అధికమవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

# కర్కాటకం

బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.

# సింహం

కుటుంబ కలహాలకు తావియరాదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. పిల్లలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

# కన్య

సహనం వహించడం అన్ని విధాల మేలు. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు.

# తుల

పరిస్థితి మీ అదుపులో ఉంచుకోండి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. కుటుంబంలో గొడవలు జరిగే ప్రమాదం ఉంది.

# వృశ్చికం

కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. పిల్లలకు సంతోషం కలిగించే పనులను చేయడం మంచిది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

# ధనుస్సు

శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. నూతన వస్తూ, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.

# మకరం

మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి.

# కుంభం

అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి.

# మీనం

ఆకస్మిక ధన లాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు.

Tags:
Next Story
Share it