Rashi Phalalu : ఇవాళ్టి రాశి ఫలాలు..విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి

# మేషం విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

Rashi Phalalu : ఇవాళ్టి రాశి ఫలాలు..విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి
X

# మేషం

విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

# వృషభం

చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. బంధువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

# మిధునం

ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది.

# కర్కాటకం

బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు.

# సింహం

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాల మేలు. అనారోగ్య బాధలకు ఔషధ సేవ తప్పదు. అనవసర ధనవ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.

# కన్య

మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉండవు. అవకాశాలను కోల్పోతారు.

# తుల

ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది.

# వృశ్చికం

ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు.

# ధనుస్సు

అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కళాహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండడం మంచిది. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

# మకరం

గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

# కుంభం

అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువగా శ్రమిస్తారు.

# మీనం

అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. కళాహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.

Tags:
Next Story
Share it