TTD: రథసప్తమి సంధర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 15గంటల సమయం.

ఈ నెల 16వ తేదీన రథ సప్తమి ( RADHASAPTHAMI) వేడుకలు వైభవంగా నిర్వహించటం కోసం ఏర్పాట్లు చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.

TTD: రథసప్తమి సంధర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 15గంటల సమయం.
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఈ నెల 16వ తేదీన రథ సప్తమి ( RADHASAPTHAMI) వేడుకలు వైభవంగా నిర్వహించటం కోసం ఏర్పాట్లు చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఇందులో భాగంగా తిరుపతి( TIRUPATHI) శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

ఈ రథసప్తమి సంధర్భంగా స్వామి వారు సూర్య ప్రభ వాహనంలో( SURYA PRABHA VAHANAM) కొలువ్వనున్నారు.ఆరోజు ఉదయం భానుని కిరణాలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామివారి లలాటఫలకం, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

భక్తుల రద్దీ విషయానికి వస్తే నిన్న తిరుమలలో( TIRUMALA) స్వామివారిని దర్శనం చేసుకున్న మొత్తం భక్తుల సంఖ్య 72,256 అని టిటిడి ప్రకటించింది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,021 మంది కాగా, నిన్న ఒక్కరోజే స్వామి వారి హుండీ ఆదాయం 3. 04 కోట్లని పేర్కొంది. స్వామివారిని దర్శించుకోవడానికి 21 కంపార్ట్మెంట్లలో నిన్న భక్తులు వేచి ఉన్నారని టిటిడి వెల్లడించింది. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని తెలిపింది టీటీడి బోర్డు.

Tags:
Next Story
Share it