కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రచురించిన కొన్ని అధ్యయనాలతో ప్రజలు గుండె పోటు మరణాలకు అదే కారణమని భావిస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కరోనా మహమ్మారి వచ్చిన దగ్గర నుంచే ఆరోగ్య ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నవారు ...టక్కున గుండె ఆగి చనిపోతున్నారు. ఈ మరణాలకు కరోనా వ్యాక్సిన్ ప్రధాన కారణమని ప్రజల్లో అపోహ నెలకొంది. కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రచురించిన కొన్ని అధ్యయనాలతో ప్రజలు గుండె పోటు మరణాలకు అదే కారణమని భావిస్తున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రచురించిన కొన్ని అధ్యయనాలతో ప్రజలు గుండె పోటు మరణాలకు అదే కారణమని భావిస్తున్నారు.. అయితే, దేశంలో గుండెపోటు కారణంగా ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రధాన కారణం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిజానికి ఫిజికల్ గా ఫిట్ నెస్ లేకపోవడం లేకపోతే అధికంగా శరీరాన్ని కష్టపెట్టడం కూడా ఈ ఆకస్మిక గుండె పోటుకు కారణాలు కావచ్చు. కాని కరోనా వ్యాక్సిన్ కారణం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఇందుకోసం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పరిశోధనలను కూడా ఆరోగ్య మంత్రి రాజ్యసభలో సమర్పించారు.
గత కొన్నేళ్లుగా దేశంలో ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణమనే భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని ICMR ఈ పరిశోధనను నిర్వహించింది. ఈ పరిశోధనలో తమకు వాక్సిన్ కారణంగా ఇలా జరిగినట్లు ఏం కనిపించలేదని తెలిపారు. అయితే అకాల మరణాలకు అతిగా ఫిజికల్ అవ్వడం ..లేదా అస్సలు ఫిజికల్ ఫిట్ నెస్ లేకపోవడం కూడా మరణాలకు కారణం అయ్యి ఉండవచ్చని తెలిపారు.