ఎండుమిర్చి తింటున్నారా అయితే జాగ్రత్త.!

మన తాతలు తండ్రుల కాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకున్న ఏమీ అయ్యేది కాదు. కానీ ప్రస్తుత కాలంలో మనం తినడమే శాపంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఏ ఆహార పదార్ధమైన సరే

ఎండుమిర్చి తింటున్నారా అయితే జాగ్రత్త.!
X

న్యూస్ లైన్ డెస్క్: మన తాతలు తండ్రుల కాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకున్న ఏమీ అయ్యేది కాదు. కానీ ప్రస్తుత కాలంలో మనం తినడమే శాపంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఏ ఆహార పదార్ధమైన సరే పెస్టిసైడ్స్ వేసి మరీ పండిస్తున్నారు. ప్రతిరోజు మనం తినే ఆహారంతో పాటు ఎంతో కొంత విష పదార్థాన్ని బాడీలోకి ఎక్కిస్తున్నామన్నమాట. అలాంటి ఈ తరుణంలో మనం మిరపకాయలు తిన్నా కానీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా చాలామంది ఎండుమిరపకాయలు చాలా స్పైసీగా ఉంటాయని ఫుడ్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ఈ మిరపకాయ పొడి టేస్టీగా ఉంటుందని ఆహారంలో కలుపుకుంటూ ఉంటారు. ఇది మోతాదు మించితే మాత్రం అనేక అనారోగ్య సమస్యలకు కారకమవుతుందట.

ఎండు మిరపకాయలను లేదంటే మిరపపొడిని ఎక్కువగా తినడం వల్ల మీ జీర్ణ క్రియ దెబ్బతింటుందట. ఎండుమిర్చిలో ఉండే క్యాప్ససిన్ కడుపులోని పొరను చికాకు పెట్టి గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలను తెస్తుందట. అలాగే గొంతు, నోటిలో చికాకు పుట్టించి దురదకు కారణం అవుతుందట. అంతేకాకుండా ఈ పొడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, తిమ్మిర్లు, జీర్ణ క్రియపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఎండుమిర్చిలను ఎలర్జీ ఉన్నవారు తీసుకోకపోవడమే మరీ మంచిది. దీనివల్ల శరీరంపై దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయని అంటున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎండుమిర్చి మరియు మిర్చి పొడిని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని వైద్యులు అంటున్నారు.

Tags:
Next Story
Share it