utrus: గర్భాశయ ఆరోగ్యం కోసం పాప్ స్మియర్ టెస్ట్..అవసరమా!

ఆడవాళ్లు ఇప్పుడు ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకారమైన వ్యాధి గర్భాశయ క్యాన్సర్ . చిన్న వయసులోనే గర్భాశయ క్యాన్సర్లతో చావు వరకు వెళ్తున్నారు.

utrus: గర్భాశయ ఆరోగ్యం కోసం పాప్ స్మియర్ టెస్ట్..అవసరమా!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఆడవాళ్లు ఇప్పుడు ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకారమైన వ్యాధి గర్భాశయ క్యాన్సర్ . చిన్న వయసులోనే గర్భాశయ క్యాన్సర్లతో చావు వరకు వెళ్తున్నారు. అయితే క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తిస్తే దానిని ఆపడానికి వీలు కలుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు సర్వైకల్ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

సర్వైకల్ క్యాన్సర్ ( cervical cancer) విషయంలో కచ్చితంగా మహిళలు పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. పాప్ స్మియర్ టెస్ట్ అనేది గర్భాశయ క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్( screening test) . సెక్స్ చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిందే. 21సంవత్సరాల నుండి 29సంవత్సరాల వయసు గల స్త్రీలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి.

ఇక 30 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు వయసుగల మహిళలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ చేయించుకోవాలి. అయితే సెక్స్ లో తరచుగా పాల్గొనని మహిళలు ఐదు సంవత్సరాలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవచ్చు. సెక్స్ లో తరచూ పాల్గొనేవారు ఏదైనా అనుమానం కలిగినా పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవచ్చు. పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవడం వల్ల ఒకవేళ క్యాన్సర్ సంబంధిత లక్షణాలు ఉంటే ప్రాథమిక దశలోనే చికిత్స చేయడానికి వీలవుతుంది. క్యాన్సర్ కు సంబంధించిన కణాలు ఏవైనా గర్భాశయ ముఖద్వారంలో ఉంటే వాటిని గుర్తించి హెచ్చరించే పరీక్ష.

Tags:
Next Story
Share it