Fennel Seeds: సోంపు గింజలతో బరువు తగ్గొచ్చు….ట్రై చెయ్యండి..

fenel seeds : మనలో చాలా మందికి భోజనం చేయగానే నోట్లో వక్కపోడిగానీ, సోంపు గింజలుగానీ వేసుకోవడం అలవాటు. సోంపు గింజలను మౌత్‌ ఫ్రెషనర్‌గా కూడా వాడుతుంటారు. సోంపును కూరల్లో, స్వీట్ల తయారీలో కూడా వాడుతుంటారు. వక్కపొడి అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు కానీ, సోంపు గింజలు నమలడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్

Fennel Seeds: సోంపు గింజలతో బరువు తగ్గొచ్చు….ట్రై చెయ్యండి..
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మనలో చాలా మందికి భోజనం చేయగానే నోట్లో వక్కపోడిగానీ, సోంపు గింజలుగానీ వేసుకోవడం అలవాటు. సోంపు గింజలను మౌత్‌ ఫ్రెషనర్‌గా కూడా వాడుతుంటారు. సోంపును కూరల్లో, స్వీట్ల తయారీలో కూడా వాడుతుంటారు. వక్కపొడి అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు కానీ, సోంపు గింజలు నమలడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

read also : SPORTS BRA : స్పోర్ట్స్ బ్రా డైలీ వేసుకుంటున్నారా.. ఇవి మీరు తెలుసుకోవాల్సిందే..

నిజానికి ఈ సోంపులో చాలా ఉన్నాయి . సోంపులో కాల్సియం, మెగ్నిషియం, ఫాస్పరస్‌, పొటాషియం, ఏ, సీ విటమిన్లు వంటి పోషక విలువలు లభిస్తాయి. సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి.సోంపును నిత్యం తినడం ద్వారా శరీరం బరువును తగ్గించుకోవచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఈ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ఫలితంగా శరీరం బరువు తగ్గడాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఇవి శరీరంలోని విషాలను విడుదల చేయడానికి, కొవ్వు తగ్గడాన్ని వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది.

సోపు గింజలను తినడానికి ఇష్టం లేకపోతే ఫెన్నెల్ టీ తాగడం ఉత్తమమైన మార్గం. బరువును తగ్గించుకోవాలనుకునే వారు కొన్ని కోరికలను తగ్గించుకోవాలి. ఆకలిగా అనిపించినప్పుడు కప్పు ఫెన్నెల్ టీ తాగండం అలవాటు చేసుకోవాలి. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా జీర్ణశక్తిని పెంచుతుంది. ఒక చిటికెడు సోపు గింజలను నీటిలో వేసి మరిగించి ఫన్నెల్‌ టీ సిద్ధం చేసుకోవచ్చు. మరింత రుచికరంగా చేసుకోవడానికి దీనికి బెల్లం కలుపుకోవచ్చు.

read also :TURMERIC : పసుపుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే..?

ఖాళీ కడుపుతో తినడం ..బరువు తగ్గాలంటే ఖచ్చితంగా ఖాళీ కడుపుతోనే చెయ్యాలి.గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం వినే ఉంటాం. ఈ నీళ్లలో నిమ్మరసం కలుపుకుంటే మరింత గ్రేట్‌గా మారుతుంది. అదేవిధంగా, ఉదయం పూట సోంపును నీటితో కలిపి తీసుకుంటే శరీరం బరువు తగ్గడానికి గ్రేట్‌గా సాయపడుతుంది. సోంపు తీసుకోవడం వల్ల శరీరంలోని పోషకాలు విడుదలై పలు పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది అదనంగా బరువు తగ్గేందుకు సాయపడుతుంది.

read also :

మీకు ఇలా కాకపోతే రాత్రి నానబెట్టి కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో వేసి రాతంత్రా నానబెట్టాలి. ఉదయం వేళ ఈ నీటిని తాగాలి. ఫన్నెల్ గింజల్లో ఉండే పోషకాలు ఐదు నుంచి ఆరు గంటల వ్యవధిలో నీటిలోకి విడుదలవుతాయి. ఈ నీటిని తాగగానే అన్ని పోషకాలు శరీరంలోకి చేరి ఆకలి కాకుండా చేస్తాయి.

read also : SPORTS BRA : స్పోర్ట్స్ బ్రా డైలీ వేసుకుంటున్నారా.. ఇవి మీరు తెలుసుకోవాల్సిందే..

సోంపు గింజలను రుబ్బుకుని నీటితో కలుపుకుని తాగవచ్చు. పండ్ల సందుల్లో ఇరక్కుంటుందని చాలా మంది బాధపడుతుంటారు. అందుకని సోంపును పౌడర్‌ మాదిరిగా చేసుకుని నీటిలో కలుపుకుని తాగుతుండాలి. మలబద్దకం, గ్యాస్‌, ఎసిడిటీకి చక్కని పరిష్కారం. పౌడర్ లాగా…లేదా మరొక రకంగా ఏదో ఒకలా పొట్టలోకి పంపితే దాని పని అది చేసి మిమ్మల్ని హెల్దీ గా ..స్లిమ్ గా రెడీ చేస్తుంది.

ఇవి కూడా చదవండి :

Tags:
Next Story
Share it