Helath tips:బెల్లం, మొలకెత్తిన శనగలు కలిపి తింటే అలాంటి సమస్యలకు చెక్..!!

health tips : మనం ప్రతిరోజు బెల్లం మరియు మొలకెత్తిన శనగలను కల్పి తీసుకుంటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. దీనివల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా మనిషి చాలా బలంగా ఉంటారని వైద్యులు అంటున్నారు. వీటిని కలిపి తింటే విటమిన్లు ఖనిజాలతో కూడిన పోషకాహారం మనకు అందుతుంది. బెల్లంలో ఉండే యాంటీ

Helath tips:బెల్లం, మొలకెత్తిన శనగలు కలిపి తింటే అలాంటి సమస్యలకు చెక్..!!
X

న్యూస్ లైన్ ఆరోగ్యం :మనం ప్రతిరోజు బెల్లం మరియు మొలకెత్తిన శనగలను కల్పి తీసుకుంటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. దీనివల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా మనిషి చాలా బలంగా ఉంటారని వైద్యులు అంటున్నారు. వీటిని కలిపి తింటే విటమిన్లు ఖనిజాలతో కూడిన పోషకాహారం మనకు అందుతుంది. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. మొలకెత్తిన శనగల్లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. జింకు, సెలీనియం ఎక్కువగా ఉంటాయి.

read also : SPORTS BRA : స్పోర్ట్స్ బ్రా డైలీ వేసుకుంటున్నారా.. ఇవి మీరు తెలుసుకోవాల్సిందే..

మొలకెత్తిన శనగలలో విటమిన్ బీ7, విటమిన్ సి, పోలేట్, రైబో ప్లావీన్, మ్యాంగనీస్, ఐరన్ ఇలా అనేక విటమిన్స్ ఉంటాయి. బెల్లంలో ఐరన్, పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య దూరం అవుతుంది. మరి ముఖ్యంగా ముదురు రంగులో ఉన్న బెల్లమును వాడాలి. ఒకరకంగా చెప్పాలంటే ముదురురంగులో ఉన్న బెల్లం ఆర్గానిక్ బెల్లం. పసుపు రంగులో ఉంటుంది ఆర్గానిక్ బెల్లం వాడడానికి ప్రయత్నం చేయండి. బెల్లం శనగలు కలుపుకొని తింటే కండరాల బలవపేతమవుతుంది.

read also : CANCER : కాన్సర్ 1ST స్టేజ్ లో కనిపించే లక్షణాలు..ఏంటంటే..?

ఎందుకంటే శనగల్లో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండటం వల్ల కండరాలు అభివృద్ధి చెందుతాయి. అలాగే బెల్లం శనగలు కలుపుకొని తింటే బరువు సమస్య తగ్గుతుంది. జీవక్రియలు బాగా పెరుగుతాయి. ఆహారం స్పీడ్ గా జీర్ణం అవ్వటానికి ఎంజైముల సక్రీయం చేసి ప్రేగు కదలికను ప్రేరేపిస్తుంది. మలబద్ధక సమస్య దూరం అవుతుంది. జ్ఞాపక శక్తి పెంపొందుతుంది. మరి ఎందుకు ఆలస్యం మన ఇంట్లో దొరికే శనగలు బెల్లాన్ని కలుపుకొని ప్రతిరోజు తినేయండి.

ఇవి కూడా చదవండి

Tags:
Next Story
Share it