మామిడి పండ్లు అతిగా తింటున్నారా.... అయితే ఇదే జరుగుతుంది...

మామిడి పండ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఒక మోస్తరు మామిడి పండును తినడం 135 క్యాలరీలు లభిస్తాయి. అందువల్ల ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లను తినడం వల్ల మీకు తెలియకుండానే బరువు పెరుగుతారు

మామిడి పండ్లు అతిగా తింటున్నారా.... అయితే ఇదే జరుగుతుంది...
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : పండ్లకు రారాజు మామిడిపండు ...అలాంటి రాజు ను ఇష్టపడి వారు చాలా తక్కువ మందే. కాని సీజన్ కోసం వెయిట్ చేసే వాళ్లు మాత్రం చాలా ఎక్కువ మంది. ఒక్కోక్క పండు కు ఒక్కో రుచి ...ఒక దాని రుచి మరొక దానికి రాదు. ప్రతి ఒక్కరి నోరు ఊరించడం ఖాయం. బంగినపల్లి, తోతపురి, కొబ్బరి మామిడి, రసాలు ఇలా అనేక రకాల మామిడి పండ్లు మన కళ్లముందు కనబడుతుంటే ఆగలేక తినేస్తాం. అందుకే మామిడిని పండ్లలో రారాజు అంటారు. అయితే మామిడి పండ్లను మితంగా తీసుకుంటే ఫర్వాలేదు కానీ.. లెక్కకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమే. మరి మామిడి పండ్లను అపరిమితంగా తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు పెరుగుతారు..
మామిడి పండ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఒక మోస్తరు మామిడి పండును తినడం 135 క్యాలరీలు లభిస్తాయి. అందువల్ల ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లను తినడం వల్ల మీకు తెలియకుండానే బరువు పెరుగుతారు. అయితే రోజూ వ్యాయామం చేసేవాళ్లకు ఇది పెద్ద ఇబ్బంది కాదు. మామిడి పండ్లు ఎక్కువగా తిన్నా.. రోజూ ఓ అరగంట వ్యాయామం చేస్తే బరువు పెరిగే అవకాశం ఉండదు.

అంతే కాదు ...ఎలాంటి షుగర్ లేని వారికి కూడా గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ...కాస్త తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అయితే చాలా యాక్టివ్ గా ఉంటారు కూడా ...ఎక్కువ ప్రొటీన్స్ ..ఎక్కువ విటమిన్స్ శరీరానికి అందుతాయి.

విపరీతమైన మొటిమలు వస్తాయి...వేడి చేస్తుంది. వీటికి చలువ చేసే గుణం ఉండదు. కాబట్టి మనం ఎంత తింటే అంత వేడి చేసి ఫేస్ పాడవుతుంది. కాబట్టి దీనిని ఎంత తక్కువగా తింటే మంచిది.

Tags:
Next Story
Share it