"లక్ష్మిచారు" ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుందా..?

ప్రస్తుత కాలంలో చాలామంది చైనీస్ ఫుడ్ కు అలవాటు పడి మన సాంప్రదాయ వంటకాలను మర్చిపోతున్నారు. మన పూర్వకాలపు అమ్మమ్మలు చేసే వంటలు ఎంతో అద్భుత రుచినివ్వడమే

లక్ష్మిచారు ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుందా..?
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది చైనీస్ ఫుడ్ కు అలవాటు పడి మన సాంప్రదాయ వంటకాలను మర్చిపోతున్నారు. మన పూర్వకాలపు అమ్మమ్మలు చేసే వంటలు ఎంతో అద్భుత రుచినివ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తూ ఉండేవి. ప్రస్తుతం అమ్మమ్మ ఆహారాలను అటకెక్కించారు. అక్కరకు రాని ఆహారాలను ఆస్వాదిస్తున్నారు. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. అమ్మమ్మ వంటల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లక్ష్మీ చారు. ఈ చారు వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలగడమే కాకుండా, ఎలాంటి రోగాలను దరిచేరకుండా ఉంచుతుందట. మరి ఈ చారు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం..

ఒక మట్టి కుండ తీసుకొని దానికి బయట వైపు పసుపు రాసుకోవాలి. ఈ కుండలో వార్చిన గంజి వేసి మూత పెట్టుకోవాలి. ఆ మరుసటి రోజు కూడా రెండవసారి కూడా కడిగిన బియ్యం నీళ్లను అందులో పోసుకోవాలి. ఆ తర్వాత అన్నం వార్చగా వచ్చిన గంజిని అందులో పోసుకోవాలి. ఇలా మూడు రోజులపాటు చేసిన తర్వాత, ఆ గంజి మొత్తం పులుస్తోంది. ఇక నాలుగవ రోజు పైన ఉండే వాటర్ ను ఒక గిన్నెలో తీసుకోవాలి. చివరికి కాస్త మిగిలిన చిక్కని ద్రావణాన్ని వేరే పాత్రలోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఇందులో వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి వెల్లుల్లి, టమాటా ముక్కలు, మునక్కాయ ముక్కలు, కరివేపాకు కుండలో వేసి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. అలాగే అది మరుగుతున్నప్పుడు ఒక కప్పు తురిమిన తోటకూర, సరిపడా కారం వేసి, అలా చారు కొద్దిగా చిక్కబడే వరకు మరిగించుకోవాలి. చివరికి కాస్త కొత్తిమీర వేసి దించుకోవాలి. ఇక దీన్ని వేడి వేడి అన్నంలో పోసుకొని తింటే అద్భుతమైన రుచి అందిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ సెట్ అవడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయట.

Tags:
Next Story
Share it