health tips: నరాల జబ్బులకు ...ఇంటి చిట్కాలు

అసలు అవయవాలు చాలా గొప్ప పనిచేస్తాయనుకుంటాం కాని నరాలు లేని అవయవాలు వ్యర్ధం.శరీరంలో రక్తాన్ని ఒకచోటి నుండి మరొక చోటికి సరఫరా చేస్తాయి

health tips: నరాల జబ్బులకు ...ఇంటి చిట్కాలు
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మనిషి శరీరంలో అతి ముఖ్యమైనవి. అసలు అవయవాలు చాలా గొప్ప పనిచేస్తాయనుకుంటాం కాని నరాలు లేని అవయవాలు వ్యర్ధం.శరీరంలో రక్తాన్ని ఒకచోటి నుండి మరొక చోటికి సరఫరా చేస్తాయి. ఒక్కోసారి నరాలు బలహీనపడితే మనం అనేక అనారోగ్యాలను ఎదుర్కోవలసి వస్తుంది. నిజానికి నరాలు దెబ్బతింటే పనికిరాం అంతే. ఏ పని చెయ్యాలన్నా శరీరం సహకరించాలి. అంటే నరాలు బాగా ఉండాలి. చిన్న నరం అదుపు తప్పినా బాధభరించలేం. అలాంటి నరాల బలహీనతలు ఏదైనా ఇబ్బందులు వస్తే చిన్న చిన్న చిట్కాలతో ఎలా పోగొట్టుకోవాలో చూద్దాం.

నరాల బలహీనతతో పాటు, వివిధ నరాల సంబంధిత వ్యాధులకు గురవుతున్న వారు ఆహారం పైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. నరాల బలహీనతతో బాధపడేవారు రెగ్యులర్ గా వ్యాయామం, యోగ ( YOGA) అలవాటు చేసుకుంటే నరాల వ్యవస్థ పటిష్టంగా మారుతుంది.ఇక నరాల బలహీనతను తగ్గించడంలో మందుల కంటే పండ్లు ( FRUITS) మంచి పాత్ర పోషిస్తాయి. దానిమ్మ పండు, నారింజపండు, కివీస్, స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన నరాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను, అవిసె గింజలను, అక్రోట్ గింజలను వాడటం వలన కూడా ఫలితం ఉంటుంది. ముదురు రంగులో ఉండే ఆకుకూరలు కూరగాయలు కూడా నరాల వ్యాధులను తగ్గిస్తాయి. దాల్చిని చెక్క..నల్లయాలుకలు దంచి ఉంచుకోవాలి. ఆ పొడిని నీటిలో కలుపుకొని తాగాలి. కాల్షియం, ఐరన్ బాగా ఉండే ఫుడ్ తీసుకుంటే నరాల బలహీనతల ప్రాబ్లమ్స్ ఉండవు.

Tags:
Next Story
Share it