Health:అలాంటి వాళ్ళు కీరదోస అస్సలు తినకూడదట.!

ఎండాకాలంలో విరివిగా దొరికే పండ్లలో చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది పుచ్చకాయ, మామిడికాయ మొదటి స్థానంలో ఉంటాయి. కానీ వీటన్నిటికంటే ఆరోగ్యానికి మేలు చేసే

Health:అలాంటి వాళ్ళు కీరదోస అస్సలు తినకూడదట.!
X

న్యూస్ లైన్ డెస్క్: ఎండాకాలంలో విరివిగా దొరికే పండ్లలో చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది పుచ్చకాయ, మామిడికాయ మొదటి స్థానంలో ఉంటాయి. కానీ వీటన్నిటికంటే ఆరోగ్యానికి మేలు చేసే మరో కాయ కూడా ఉంది అదే కీరదోస. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలగడమే కాకుండా, ఎండాకాలంలో మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇలాంటి కీరదోసను అందరూ తినకూడదట. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు తినకూడదని వైద్యులు అంటున్నారు. వారి వారెవరో చూద్దాం. కొంతమందికి యూరిన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

ఈ సమస్య ఉన్నవారు కీరదోసను ఎక్కువగా తినకూడదట. తింటే వారికి సమస్య జటిలమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వారు కూడా కీరదోస తినకూడదట. దీనివల్ల ఎసిడిటీ సమస్య మరింత పెరిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు కీరదోస తినకూడదట.

దీనివల్ల ఆ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎవరికైనా స్కిన్ ఎలర్జీలు, ఫుడ్ ఎలర్జీలు ఉంటే కీరదోసలు తినకూడదట. దీనివల్ల ఆ సమస్య ఎక్కువ అవుతుందట. అంతేకాకుండా రాత్రి సమయంలో కీరదోస ఎక్కువగా తినకూడదట. దీనివల్ల రాత్రిళ్ళు నిద్రకు ఆటంకం కలుగుతుందని నిపుణులు అంటున్నారు.

Tags:
Next Story
Share it