Turmeric : పసుపుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే..?

Turmeric : సాధారణంగా పసుపును  ఎక్కువగా వంటల్లో  వాడుతూ ఉంటారు. పసుపు అనేది యాంటీబయాటిక్ గా  పనిచేస్తుంది. పూర్వకాలంలో ఎక్కువగా పసుపు పెట్టుకొని స్నానం చేసేవారు.  ప్రస్తుతం అదే పసుపు ద్వారా సోపులు తయారుచేసి మనకు అమ్ముతున్నారు. మరి పసుపుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Turmeric : పసుపుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే..?
X

న్యూస్ లైన్ : సాధారణంగా పసుపును ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటారు. పసుపు అనేది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. పూర్వకాలంలో ఎక్కువగా పసుపు పెట్టుకొని స్నానం చేసేవారు. ప్రస్తుతం అదే పసుపు ద్వారా సోపులు తయారుచేసి మనకు అమ్ముతున్నారు. మరి పసుపుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక బౌల్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్ తేనె, పసుపు వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి 20 నిమిషాల తర్వాత అడిగితే చర్మంపై ఉండే నొప్పులు తొలగిపోతాయి నల్లని మచ్చలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఒక బౌల్ లో మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్, అర టీ స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ రసం పిండి మిశ్రమాన్ని కలపాలి. దీన్ని ముఖానికి పట్టించుకుని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా అవుతుంది.

టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి మీ చర్మం పొడిగా ఉంటే టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. నిమ్మరసం బదులు తేనె వేసి కలపాలి. దీన్ని ముఖానికి మర్దన చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె వేసిన తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు కలపాలి. ఆలివ్ నూనె అందుబాటులో లేకపోతే కొబ్బరి నూనె తీసుకున్న పర్వాలేదు. దీన్ని ముఖానికి పట్టిస్తే మాయిశ్చరైజర్ల పని చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పుదీనా పేస్టు లోకి అర టీ స్పూన్ పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం మీద ఉండే గాయాలు మానిపోతాయి.

Tags:
Next Story
Share it