Sports Bra : స్పోర్ట్స్ బ్రా డైలీ వేసుకుంటున్నారా.. ఇవి మీరు తెలుసుకోవాల్సిందే..

స్పోర్ట్స్ బ్రా కోసం ఆడవాళ్లలో చాలా మంది తెలీదు. బ్రా అనగానే సరైన షేప్ కోసం వేసుకుంటున్నాం అనుకొని తెగ ఫిట్టింగ్ ట్రై చేస్తుంటారు.

Sports Bra : స్పోర్ట్స్ బ్రా డైలీ వేసుకుంటున్నారా.. ఇవి మీరు తెలుసుకోవాల్సిందే..
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : స్పోర్ట్స్ బ్రా కోసం ఆడవాళ్లలో చాలా మంది తెలీదు. బ్రా అనగానే సరైన షేప్ కోసం వేసుకుంటున్నాం అనుకొని తెగ ఫిట్టింగ్ ట్రై చేస్తుంటారు. దీని వల్ల ప్రమాదమే కాని మీ శరీరానికి ..మీ ఫిగర్ కు ఉపయోగం ఏం లేదు. పోగా ఇంకా వెన్ను నొప్పులు, బ్రెస్ట్ క్యాన్సర్లు, బ్లడ్ ప్రజర్స్ తక్కువగా ఉండడం లాంటివి జరిగి మీ ప్రాణాలకే ప్రమాదం అవుతుంది.

ఇఫ్పుడున్న టైంలో స్పోర్ట్స్ బ్రా వేసుకోవడం కంపల్సరీ.. అయితే ఇది అందం కోసమో.. లేక స్టనింగ్ ఫిగర్ కోసమో కాదు. ఆడవారి కంఫర్ట్ కోసం.. మగవారి చూపులు పడకుండా జాగ్రత్త పడడం కోసం వేసుకుంటున్నారు. దీన్ని మనం కాదనలేని నిజం. అయితే ఇలావేసుకోవడం కూడా ప్రమాదమే అంటున్నారు డాక్టర్లు.

స్పోర్ట్స్ బ్రా అయితే ఎక్కువగా అథ్లెటిక్స్, అలాగే క్రీడల్లో ఉన్న మహిళలు ధరిస్తూ ఉంటారు. ఇవి కొంచెం ఎక్కువగా బిగుతూగా ఉంటాయి. తద్వారా క్రీడలు ఆడుతున్న సమయంలో ఎద భాగంలో ఇబ్బంది లేకుండా దిగుతుగా ఉంటుంది. కానీ స్పోర్ట్స్ బ్రా మామూలు సమాయాల్లో ధరించడం స్త్రీలకు అంత మంచిది కాదు అనే చెప్పాలి. ఇది అంత కంఫర్ట్ కాదు . స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల స్త్రీల శరీరంపై చాలా ప్రభావం పడుతుంది. చాలా మంది మహిళలు 24 గంటల పాటు ఈ రకం బ్రా ధరిస్తారు.

Read Also : CANCER : కాన్సర్ 1ST స్టేజ్ లో కనిపించే లక్షణాలు..ఏంటంటే..?

ఎక్కువసేపు స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల మెడ నొప్పి వస్తుంది. చాలా టైట్ గా ఉండే స్పోర్ట్స్ బ్రా వేసుకోవడం వల్ల వెన్నునొప్పి సమస్య రావచ్చు. ఈ సమస్య ఎక్కువగా రొమ్ము పరిమాణం ఉన్న మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. రోజంతా స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల చర్మం ఊపిరి పీల్చుకోదు.24 గంటల పాటు స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల రక్తప్రసరణపై ప్రభావం పడుతుంది. స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ టిష్యూ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.

రోజంతా స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల రొమ్ము నొప్పి వస్తుంది. సరైన సైజు బ్రా ధరించని మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కాదు మీరు ఫ్యాషన్ కు పోయి రోజంతా బ్రాలు వేసుకుంటే తప్పనిసరిగా బ్రెస్ట్ లో క్లాట్స్ వస్తాయి. దీనితో పక్కాగా సర్జరీ వరకు వెళ్తుంది. ఇదే కాదు మీరు చూసుకోకపోతే ఇదే బ్రెస్ట్ క్యాన్సర్.

Read Also : MANICYUR : మానిక్యూర్ ,పెడిక్యూర్ అతిగా చేసినా ప్రమాదమే....

వేసవి కాలంలో 24 గంటల పాటు బ్రా ధరించడం వల్ల రొమ్ము చుట్టూ తేమ నిరంతరం ఉంటుంది. దీని వల్ల ఫంగల్ వ్యాపించే అవకాశం ఉంది. దీంతో మీకు తామర లాంటి అంటురోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. జిమ్ కోసం వెళ్తున్నప్పుడు ఈ బ్రా వాడుకోవచ్చు.కాస్త మీ సైజ్ కంటే ఎక్కువ సైజ్ బ్రా ధరించడం వల్ల అనేక వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంది.

దీని కంటే మీరు మంచి కాటన్ ఇన్నర్స్ వాడడం వల్ల మీ శరీరానికి చాలా మంచిది. అంతేకాదు మీరు ఎక్కువ టైట్ బట్టలు వేసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే అందం కోసం కాకుండా ఆరోగ్యం కోసం బట్టలు వేసుకోవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది.

ఇవి కూడా చదవండి :

Tags:
Next Story
Share it