school : ఎయిడెడ్ స్కూల్స్ లో టీచర్ పోస్టులకు దరఖాస్తులు !

టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల్లో ప్రకటనలు జారీచేసి, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రీజినల్‌ డైరెక్టర్లను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. దీనిని మీరు ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా అప్లై చేసుకోవచ్చు.


Published Sep 29, 2024 04:59:00 PM
postImages/2024-09-29/1727609560_700govtaided.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలకు టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.  అయితే న్యాయస్థానం విద్యాశాఖ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చెయ్యాలని ఆర్డర్ పాస్ చేసింది. ఎయిడెడ్ పాఠశాల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల్లో ప్రకటనలు జారీచేసి, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రీజినల్‌ డైరెక్టర్లను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. దీనిని మీరు ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా అప్లై చేసుకోవచ్చు.


కాకినాడలోని నవభారత్‌ హైస్కూల్‌లో పీఈటీ పోస్టులు 1, ఎస్‌ఏ/ పీజీటీ పోస్టులు 5, ఎస్‌జీటీ పోస్టులు 2 ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్దులు పోస్టును బట్టి ఇంటర్మీడియట్‌, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, పీజీ, బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు టెట్‌ లేదా సీటెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరిగా సాధించి ఉండాలి. 


స్కూల్ అసిస్టెంట్ పీజీటీ, జూనియర్ లెక్చరర్ , ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ , సెకండరీ గ్రేడ్ టీచర్ ..ఉపాధ్యాయ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.అయితే ఇంట్రస్ట్ ఉన్నవారిని అఫిషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని కోరింది. అయితే రాత పరిక్ష , ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టుల్లో టీచర్లను భర్తీ చేస్తారు.

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu school-teacher comptetive-exams

Related Articles