Viral: పూర్వ జన్మలు ఉంటాయంటారా...ఇదిగో సాక్ష్యం

ఓ హోటల్ లో స్టే చేయడానికి అన్ని ప్లాన్ చేశారు.దిగిన రోజు సాయంత్రం డిన్నర్ చేసేందుకు ఆ హోటల్‌లోని రెస్టారెంట్‌కి వెళ్లారు.

Viral: పూర్వ జన్మలు ఉంటాయంటారా...ఇదిగో సాక్ష్యం
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఓ బ్రిటిష్ ఫ్యామిలీకి( BRITISH FAMILY) ఈ వింత అనుభవం ఎదురైంది. ఏదో సమ్మర్ కదా..హాలిడే ఎంజాయ్ చేసేందుకు వేరే దేశం వెళ్లింది. ఓ హోటల్ లో స్టే చేయడానికి అన్ని ప్లాన్ చేశారు.దిగిన రోజు సాయంత్రం డిన్నర్ చేసేందుకు ఆ హోటల్‌లోని రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ గోడకున్న ఓ ఫోటో చూడగానే.. ఆ బ్రిటిష్ లేడీ ఫ్యూజులెగిరిపోయాయి.

అసలు కథేంటంటే...జెన్నీ స్టీవెన్సన్( JENNY) అనే మహిళ వాస్తవానికి బ్రిటన్‌లో నివాసముండేది. అయితే రెండేళ్ల క్రితం బ్రిటన్ నుంచి స్వీడన్‌కు కుటుంబంతో కలిసి మారింది.ఎయిర్‌బిఎన్‌బి అనే ఓ హోటల్‌లో బస చేశారు. ఆ హోటల్ రద్దీ ప్రాంతానికి దూరంగా ఉండటంతో.. అక్కడ పెద్దగా జనాల రాకపోకలు తక్కువ. అక్కడ వారంతా డైనింగ్ టేబుల్‌పై కూర్చుండగా.. ఎదురుగా గోడకు వేలాడుతున్న ఓ పెయింటింగ్( PAINTING) చూసి ఆశ్చర్యపోయారు. ఆ పెయింటింగ్ లో తన కొడుకు ఉన్నాడు. అది కూడా 400 యేళ్ల నాటి పాత పెయింటింగ్ లో తన కొడుకును చూసి ఆశ్చర్యపోయింది.

నిజానికి ఈ పెయింటింగ్ తన కూతురు చూసింది . ‘అమ్మా.! చూడు, గోడపై బర్నీ చిత్రం ఉంది’ అని పేర్కొందట. ఆ తర్వాత జెన్నీ కూడా ఆ చిత్రాన్ని పరిశీలించి చూడగా.. అందులో ఉన్న అమ్మాయి ముఖం.. అచ్చం తన ఏడేళ్ల కొడుకు బర్నీ ముఖంతో పోలి ఉందని గుర్తించింది. ‘ఫ్లవర్స్ ఇన్ ది మెడో’ పేరుతో ఈ పెయింటింగ్‌ను స్వీడిష్ కళాకారుడు కార్ల్ లార్సన్ రూపొందించాడట. ఆ బ్రిటన్...లేడీ ఈ విషయాన్ని హ్యాపీ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.తన కొడుకు పూర్వ జన్మలో ఓ ఆడపిల్ల అంటూ పోస్ట్ చేసింది. తెలిసిందేగా ఫుల్ వైరల్ అవుతుంది.

Tags:
Next Story
Share it